వీఐపీ మోస‌గాళ్ల తీరులో మ‌రో కోణం ఇది. రూ.8,000 కోట్ల బ్యాంకు రుణాల మనీ ల్యాండరింగ్ కేసులో మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్‌పురి లీల‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో నిందితుడిగా ఉన్న దుబాయ్ హవాలా వ్యాపారి రాజీవ్‌సక్సేనా ఇచ్చిన క్రెడిట్‌కార్డుతో రతుల్‌పురి వీలాస వంత జీవితం గ‌డుపుతున్నాడు. అమెరికాలోని నైట్‌క్లబ్‌లో ఒక్క రాత్రిలోనే సుమారు రూ.8.1 కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తెలిపింది. రతుల్‌పురి అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని  ఈడీ తెలిపింది. ప్రైవేట్ జెట్ విమానాల్లో ప్రయాణించేందుకు, నైట్‌క్లబ్బులను సందర్శించేందుకు ఆయన ఈ కార్డును ఉపయోగిస్తున్నాడని పేర్కొంది.


2011 నవంబర్, 2016 అక్టోబర్ మధ్య కాలం లో రతుల్ వ్యక్తిగత ఖర్చు సుమారు రూ. 31 కోట్లు అని పేర్కొం ది. రతుల్‌పురి అమెరికాలోని ఒక నైట్‌క్లబ్‌లో ఒక్క రాత్రిలోనే సుమారు రూ.8.1 కోట్లు ఖర్చుచేశారు అని ఈడీ తెలిపింది.  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మేనల్లుడు రతుల్‌తోపాటు, ఆయన సన్నిహితులు, మోసర్ బేర్ లిమిటెడ్‌పై దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఈడీ వెల్లడించింది. 


కాగా, అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు మనీలాండరింగ్ కేసులో ఆగస్టు 20న అరెస్టయిన రతుల్‌పురి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అయితే, ఈ కేసు విచారణ స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. విచార‌ణ‌కు హాజరైనట్టే హాజరైన‌ రతుల్ పురి తమ కన్నుగప్పి కార్యాలయం నుంచి వెళ్ళిపోయినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆరోపించింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ రతుల్ పురికి  సమన్లు జారీచేసింది. అయితే, విచారణకు హాజరైన రతుల్ పురి బాత్‌రూమ్‌కు వెళ్లాలంటూ కొద్దిపాటి విరామం తీసుకున్నారు. అయితే, ఆయన అక్కడి నుంచి ఎటో వెళ్లిపోయారని, మొబైల్‌ను కూడా స్విచ్ఛాప్ చేసి పెట్టుకున్నారని ఈడీ అధికారులు తెలిపారు. ప‌లు ప‌రిణామాల‌ అనంత‌రం ఆయ‌న్ను అరెస్టు చేసి జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీకి త‌ర‌లించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: