తెలంగాణలో నేటి నుంచి విద్యా సంస్థలన్నీ పునః  ప్రారంభం కాబోతున్నాయి. విద్యాసంస్థలకు ఈ నెల  14 వరకు ఉన్న దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం...  తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో 19 వరకు పొడిగించింది ప్రభుత్వం. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నడిచే బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఇక్కట్లు పడకూడదనే ఉద్దేశంతో సెలవులను పొడిగించింది  ప్రభుత్వం. అయితే ప్రభుత్వం విద్యాసంస్థల సెలవులను  అయితే పొడిగించింది కానీ... ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను మాత్రం పరిష్కరించలేదు. దీంతో సమ్మె ఇంతకు మునుపు కంటే ఇప్పుడు ఉద్రిక్తంగా మారుతోంది. అయితే ఇప్పటి వరకు తిరిగిన అద్దె  ప్రైవేటు బస్సులు కూడా ఇప్పుడు తిరుగుతాయో లేదో అన్న ప్రశ్న నెలకొంది. ఆర్టీసీ కార్మికులు అందరూ తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి నేటి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేసి వివిధ రూపాల్లో నిరసన తెలిపి సమ్మెకు మద్దతు కూడగట్టుకొని సకల జనుల సమ్మె రీతిలో మార్చేందుకు నిర్ణయించారు. 

 

 

 

 కాగా  రాష్ట్రంలో ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె నేటితో 17వ రోజుకు చేరుకుంది... ఓ వైపు ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె తోనే ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు... మరోవైపు టాక్సీ డ్రైవర్లు ఓనర్ల జేఏసీ  కూడా ఈ నెల 19 నుంచి సమ్మె నిర్వహిస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. కార్మికుల సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ప్రభుత్వానికి తెలిసినప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అంతేకాకుండా హైకోర్టు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశించినప్పటికీ కూడా... కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఆర్టీసీ కార్మికుల తో చర్చలు జరపలేదు ప్రభుత్వం. కాగా  తెలంగాణలో 23 రోజుల తర్వాత స్కూళ్లు కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి.  

 

 

 

 అయితే స్కూలు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు చాలామంది ఆర్టిసి బస్సు లోనే వెళ్తుండటంతో... ప్రస్తుతం ఉన్న అతి తక్కువ బస్సులతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే ప్రస్తుతం తెలంగాణలో బస్సుకు కారుకు జరుగుతున్న రగడలో  పుస్తకం బలవుతున్నట్లుంది  పరిస్థితి. ప్రైవేటు పాఠశాల  బస్సులను కూడా అద్దెకు తీసుకుని ప్రయాణికుల సౌకర్యార్థం తిప్పింది ప్రభుత్వం . ఇప్పుడు అది కూడా లేకపోవడంతో ప్రయాణికుల పరిస్థితి ఏంటి అని అందరూ ఆలోచనలో పడ్డారు . ఇక ప్రయాణికుల ఇబ్బందులను ప్రభుత్వం ఎలా గట్టెక్కిస్తుందో   చూడాలి మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: