ప్రధాని ఇటీవల కాలంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ప్రపంచంలో ఇండియాకు గౌరవం పెరగడంతో పాటుగా ఇండియా పట్ల బోర్డర్ లో ఉండే దేశాలకు భయం కూడా ఉండాలని చెప్పి నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఇందులో భాగంగానే ఆగష్టు 5 వ తేదీన జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు చేసింది.  దీంతో పాక్ ఇండియాపై బురదజల్లడం మొదలుపెట్టింది.  ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టింది.  


కాశ్మీర్లో ఏదో జరిగిపోతున్నది.. ఏదేదో జరుగుతున్నది.. చెప్పలేనంతగా ఇబ్బందులు వస్తున్నాయి. అక్కడి ప్రజలను, నేతలను బందీలుగా చేశారు.  వేలాదిమంది సైనికులను కాపలాగా పెట్టి భయపెడుతున్నారు అంటూ మండిపడింది.  కానీ, ఇండియా వాటి గురించి పట్టించుకోవడం లేదు.  ఇండియా ముందు ఉన్న సవాల్ ఒక్కటే..లక్ష్యం ఒక్కటే .. సంపూర్ణ భారతం.. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇండియాలో పూర్తగా అంతర్భాగం అయ్యింది.  ఇది భారత సమస్య.  భారత అంతర్గత సమస్య .  దాని గురించి ఎవరో మాట్లాడకూడదు అని చెప్పేసింది.  


అందుకే ప్రపంచదేశాలు ఈ విషయంలో కామ్ గా ఉంటున్నాయి. ఇక ఇండియా మిషన్ పీవోకే ను కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.  గతంలోనే 1947 వ సంవత్సరంలో ఇండియాకు స్వతంత్రం వచ్చిన సమయంలో ఇండియా ఎలాగైతే ఉన్నదో.. అలానే ఇండియా ఉండాలని.. ఇండియాకు సంబంధించిన భూభాగాలు వీటిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదని అంటోంది.  


ఇందులో భాగంగానే పీవోకే ను సైతం తిరిగి తీసుకోవడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.  ఇప్పటికే మూడుసార్లు సర్జికల్ స్ట్రైక్ చేసింది.  ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే పలుమార్లు ఆర్మీ ప్రకటించింది.  2022 నాటికీ ఇండియాలో పీవోకే అంతర్భాగం అవుతుందని అంటున్నారు.  ఒకవేళ అదే జరిగితే.. భారతదేశం తిరిగి సంపూర్ణ భారతదేశం అవుతుంది.  ఆ తరువాత లక్ష్యం అఖండ భరతదేశమే.  అది కూడా తప్పకుండా సాధ్యం అవుతుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: