ముత్యం ధర ఎంత ఉంటుంది.. ఎంత మహా అయితే రెండు మూడు వందలు ఉంటుంది.  విలువైనదైతే వెయ్యి లేదా రెండు వేలు ఉంటుంది. ముత్యాలకు అంతకంటే ఎక్కువ ధర ఉండవు.  ఖరీదు ఎక్కువ అనుకున్న అంతే ఉంటుంది. అందుకే చాలామంది ముత్యాల హారాలను మేడలో ధరిస్తూ ఉంటారు.  హైదరాబాద్ ముత్యాలకు ప్రసిద్ధి.  చార్మినార్ దగ్గర ఈ ముత్యాల దండలు ఎక్కువగా అనిపిస్తుంటాయి.  అయితే, ఇప్పుడు అమ్ముతున్న ముత్యాలలో ఏవి అసలువో ఏవి నకిలీవో గుర్తించడం కష్టంగా మారింది.  


ముత్యాల్లో ఎన్నో వెరైటీలు ఉంటాయి.. ఎన్నో రకాలు ఉంటాయి.  కానీ, అన్ని ఒకేలా ఉన్నా.. వాటి క్వాలిటీలో తేడాలను తెలుసుకోవాలి.  అప్పుడే ఏదైనా మనం వాటి గురించి తెలుసుకోవచ్చు.  ఇదిలా ఉంటె, ప్రపంచంలో అత్యంత పురాతనమైన ముత్యం ఎక్కడ ఉన్నది అంటే ఏం చెప్తాం.  ఏమని సమాధానం ఇస్తాం.. ఎవరైనా చెప్పగలరా.. అంటే చెప్పడం కష్టమే.  ముత్యాలు పురాతనమైనవి ఉన్నాయి కానీ, ఎంత పురాతనమైన ముత్యాలో  చెప్పలేం.  


ఇటీవలే యూఏఈలోని మరవాహ్ లో జరిపిన తవ్వకాల్లో ఓ ముత్యం బయటపడింది.  ఆ ముత్యాన్ని కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా పరీక్షిస్తే.. అది 8వేల సంవత్సరాల క్రితం నాటి ముత్యం అని తేలింది.  దీంతో శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు.  దీనిపై అనేక పొరలు ఉన్నారు.  ఆ పొరలపై జరిపిన పరిశోధనలు బట్టి అసలు విషయం బయటపడింది.  ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే పురాతనమైన ముత్యం అని పరిశోధకులు చెప్తున్నారు.  8 వేల ఏళ్ల నాటిది కాబట్టి దీనికి మార్కెట్లో ధర ఎంత ఉంటుంది అని చెప్పలేమని అంటున్నారు.  


గల్ఫ్ లో ఎన్నో పురాతనమైన వస్తువులు ఉన్నాయి.  అందులో ఈజిప్టు మమ్మీలు, ఇతర వస్తువులు ఉన్నాయి.  కానీ, యూఏఈలో అత్యంత పురాతనమైన వస్తువుగా ఈ ముత్యం గుర్తింపు పొందింది.  ఈనెల 30 వ తేదీ నుంచి యూఏఈలోని అబుదాబిలో లౌవ్రె అబుదాబి ఎక్సిబిషన్ జరగబోతున్నది.  అందులో ఈ ముత్యాన్ని ప్రదర్శించబోతున్నారు.  పురాతనమైన ముత్యం కాబట్టి దానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: