తెలంగాణ వ్యాప్తంగా రెండు విష‌యాలు టెన్ష‌న్ టెన్ష‌న్‌గా ఉన్నాయి. ఒక‌టి ఆర్టీసీ స‌మ్మె, రెండోది హుజూర్‌న గ‌ర్ ఉప ఎన్నిక‌. ఈ రెండు కూడా రాష్ట్రంలో అటు రాజ‌కీయ వ‌ర్గాల‌ను, ఇటు సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను కూడా ప్ర భావితం చేస్తున్నాయి. స‌రే! ఇక‌, అధికార టీఆర్ ఎస్‌లో ఈ రెండు విష‌యాలు మ‌రింత దుమారం రేపుతు న్నాయి. హుజూర్ న‌గ‌ర్ ఎన్నిక విష‌యానికి వ‌స్తే.. గ‌త ఏడాది డిసెంబ‌రులో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రె స్ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి విజ‌యం సాధించారు. అయితే, ఈ ఏడాది జ‌ర‌గిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఆయ న పోటీ చేసి విజ‌యం సాధించ‌డంతో హుజూర్‌న‌గ‌ర్ సీటుకు రాజీనామా చేశారు.


దీంతో ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే, ఈ సీటును తామంటే తామే గెలిచి తీరాల‌ని అటు అదికార టీఆర్ ఎస్‌, ఇటు ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌లు గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. ఎవ‌రికి వారు వ్యూహాత్మ‌కంగా ఇక్క‌డ విజ‌యం సాధించేందుకు పావులు క‌దుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే అధికార టీఆర్ ఎస్ పార్టీ ఇక్క‌డ పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు అప్ప‌గించింది. ఒకరు ఎలక్షన్ ఇన్ చార్జీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాగా.. మరొకరు జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి. అత్యంత ట‌ఫ్‌గా ఉన్న ఈ ఎన్నిక‌ల్లో పార్టీని గెలుపు గుర్రం ఎక్కించి సైదిరెడ్డి విజ‌యం సాధించేలా చేయాల‌ని కేసీఆర్ హుకుం జారీ చేశారు.


ఈ క్ర‌మంలో నాయ‌కులు కోరినంత డ‌బ్బు ఇచ్చారు. అదేవిధంగా అన్ని సౌక‌ర్యాలు ఏర్పాటు చేశారు. కాం గ్రెస్‌కు కంచుకోట‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పాగా వేయ‌డం ద్వారా మ‌రింత బ‌లం పుంజుకోవాలని, ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఈ ఇద్ద‌రు నాయకులు ఇప్పుడు కంటిపై కునుకు లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. వీరు స‌క్సెస్ అయితే, ఈ ఇద్ద‌రికీ ప్ర‌మోష‌న్ ఉంటుంద‌ని, లేక‌పోతే.. ఇబ్బందేన‌ని టీఆర్ ఎస్‌లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు చూస్తున్న పల్లా రాజేశ్వర్ నామినేటేడ్ పదవి రేసులో ఉన్నారు.


హుజుర్ నగర్ ఉపఎన్నిక అవగానే పల్లాకు కీలక పదవులను కట్టబెట్టే అలోచనలో ఉన్నారట సీఎం కేసీఆర్. దీంతో పల్లాకు ఈ ఎన్నిక చాలా ముఖ్యమైంది. ఎలాగైనా సరే ఉప ఎన్నిక గెలిచి తీరాలి అన్న కసితో ఆయన ఉన్నారు.ఇక మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి కూడా ఈ ఎన్నిక కీలకం. హుజుర్ నగర్ లో టీఆర్ ఎస్ ఎప్పుడు గెలవాలేదు. స్వయనా జగదీశ్ రెడ్డి కూడా పోటి చేసి ఓడి పోయారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ గెలిచి తీరాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది. తేడా వస్తే మంత్రి పదవికి గండం అని టెన్షన్ లో ఉన్నారట.దీంతో ఆయన ఆంతా తానై చూస్తున్నారట. దీంతో ఇద్ద‌రు నేత‌లు కూడా లైఫ్ అండ్ డెత్ స‌మ‌స్య‌గా ఇక్క‌డ పోరాడుతున్నట్టుచెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: