హైటెక్ సిటీ గురించి అందరికి తెలుసు.  హైటెక్ సిటీ అనగానే మనకు ముందు గుర్తుకు వచ్చేది ఐటి పరిశ్రమ.  ఐటి పరిశ్రమ అక్కడ విస్తరించింది.  భారీ భవనాలు..అధునాతనమైన బిల్డింగ్ లు.. ఎన్నో పరిశ్రమలు అక్కడ ఉన్నాయి.  దీంతో హైటెక్ సిటీ ఖరీదైన ప్రాంతంగా మారింది.  ఆ ప్రాంతంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారు. 


ఎక్కడైతే హంగామా, డబ్బు ఎక్కువవా ఉంటుందో అక్కడ అన్ని రకాల వ్యసనాలు కూడా ఉంటాయి.  ఏ మాత్రం తప్పటడుగులు వేసినా.. పాతాళంలోకి జారిపోవాల్సి వస్తుంది.  అందుకే జాగ్రత్తగా ఉంటారు.  జాగ్రత్తగా మసలుకుంటారు.  అయితే, హైటెక్ సిటీలో హైటెక్ రేంజ్ లోనే చీకటి వ్యాపారం జరుగుతున్నది. అందుకే పోలీసులు ఎప్పుడు ఆ సిటీపై నిఘా వేసి ఉంచుతున్నారు.  జరుగుతున్న విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.  ఎక్కడ ఎలాంటి ఆటంకాలు జరిగినా.. వెంటనే పట్టుకుంటున్నారు.  


ఇటీవలే మాదాపూర్ లోని ఓ హోటల్ లో పోలీసులు రైడ్ చేశారు.  ఈ రైడింగ్ లో విస్తృతపోయే నిజాలు వెలుగు చూశాయి.  అనేకమంది విదేశీ వనితలు ఆ హోటల్లో పట్టుబడ్డారు.  విదేశీ వనితలను తీసుకొచ్చి.. అక్కడ వ్యభిచారం చేయిస్తున్నారు.  ఈ విషయం పోలీసులకు తెలియడంతో పక్కా సమాచారంతో దాడి చేశారు.  దాడి జరుగుతుందని తెలుసుకున్న చాలామంది అక్కడి నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది.  


అయితే, ఈ రైడ్ లో విదేశీ వనితలతో పాటుగా పెద్ద ఎత్తున నగదు, సెల్ ఫోన్ లు దొరికాయి.  పోలీసులు వాటిని సీజ్ చేశారు.  ఆ ఫోన్స్ ఆధారంగా విటులను పట్టుకునేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు.  హైటెక్ సిటీలో ఇలాంటి చీకటి వ్యాపారాలు అనేకం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నా.. సమాచారం లేకపోవడంతో చాలా చోట్ల కామ్ గా ఉండిపోవాల్సి వస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: