2014 లో టీడీపీ  కి సపోర్ట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ 2019లో సొంతంగా ఆయన జనసేన పార్టీని స్థాపించి స్టాప్ 175 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కానీ కేవలం ఒక్క సీటుతో  ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు, ఆయన నిలబడిన రెండు నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయారు. ఎన్నికలలో ఓటమి తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కొన్ని రోజులు అమెరికా టూర్ మరియు అన్న చిరంజీవి నటించిన సినిమా ఆడియో ఫంక్షన్ లో కనిపించారు. ఇప్పుడు మళ్లీ పార్టీని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.


ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ విశాఖపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఇసుక కొరత వల్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో భవన నిర్మాణ రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ అంశాన్ని హైలెట్ చేయడం కోసం నవంబర్‌ 3న ర్యాలీ నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఉపాధిలభించకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు.. వారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారని జనసేన పార్టీ తెలిపింది.


భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నవంబర్ 3న మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కళ్యాణ్ ర్యాలీని ప్రారంభిస్తారు. ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది స్థానికులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జనసేన తెలిపింది. మంగళగిరిలో జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఉదయం ప్రారంభమైన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.


విశాఖ నగరంలో భారీగా నిర్మాణాలు జరుగుతుంటాయి. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వలస కార్మికులు ఇక్కడ పని చేస్తుంటారు. దీంతో విశాఖ వేదికగా ర్యాలీ చేపట్టాలని జనసేన నిర్ణయించిందని భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: