వైసీపీ అధినేత జ‌గ‌న్ దూకుడు పెంచారా?  ఒక‌ప‌క్క పాల‌న‌ను సాగిస్తూనే పార్టీ పునాదులు ప‌టిష్ఠం చేసేందు కు ప్ర‌య‌త్నిస్తున్నారా? ప‌్ర‌ధానంగా టీడీపీకి ప‌ట్టుగొమ్మ‌లుగా ఉన్న జిల్లాల్లో వైసీపీ పునాదుల‌ను ప‌టిష్టం చేసేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. పాల‌న‌ను రాజ‌కీయాల‌ను అనుసంధానం చేస్తూ.. ఆయ‌న వేస్తున్న అడుగులు పార్టీలో జోష్ నింపుతున్నాయి. తాజాగాజ‌గ‌న్ అమ‌లు చేస్తున్న వైఎస్సార్ రైతు భ‌రోసా కార్య‌క్ర‌మానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తోంది.


ప్ర‌ధానంగా ఈ కార్య‌క్ర‌మం ద్వారా గ్రామాలు, మండ‌లాల్లో ప‌ట్టు పెంచుకునేందుకు వైసీపీ అదినేత వ్యూహా త్మకంగా అడుగులు వేస్తున్నారు. రైతు భ‌రోసా కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా పార్టీని క్షేత్ర‌స్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేస్తున్నారు. ము ఖ్యంగా అనంత‌పురం జిల్లాలో రైతు భ‌రోసా కార్య‌క్ర‌మం ఊపందుకుంది.


రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల‌తో పోల్చుకుంటే.. ఈ జిల్లాలోల‌బ్ధి దారుల‌ను భారీగా ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 54 ల‌క్ష‌ల‌మంది ని ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధిదారులుగా చేర్చాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఇప్ప‌టి వ‌రకు మొత్తం 35.50 ల‌క్ష‌ల మందిని ల‌బ్ధి దారులుగా ఎంపిక చేశారు. ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో మిగి లిన ల‌బ్ధి దారుల‌ను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, వీరిలో ఒక్క అనంత‌పురం జిల్లా నుంచే 4,26,184 మంది ల‌బ్ది దారులు ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో జిల్లా వ్యాప్తంగా రైతులు ఆనందంలో మునిగిపోయారు.


ఈ ప‌రిణామం రాజ‌కీయంగా కూడా వైసీపీకి భారీ ల‌బ్ధి చేకూరుస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికే క‌రువుతో అల్లాడుతున్న అనంత రైతులు ఇప్పుడు అందిన భ‌రోసా డ‌బ్బుల‌తో పంట‌ల‌కు కొద్దో గొప్పో పెట్టుబ‌డులు పెట్టుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని చెబుతున్నారు. ఏదేమైనా జ‌గ‌న్ వ్యూహం గ్రేట్ అంటున్నారు వైసీపీ నాయ‌కులు.



మరింత సమాచారం తెలుసుకోండి: