జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనలే విచిత్రంగా ఉంటుంది.  ఎన్నికలకు ముందు అర్ధంపర్ధం లేని నిర్ణయాలతో నేతలు, కార్యకర్తల్లో అయోమయం సృష్టించినట్లే తాజాగా తీసుకున్న నిర్ణయంతో కూడా అందరు ఆశ్చర్యపోతున్నారు. నవంబర్ మొదటి వారం నుండి రాష్ట్రవ్యాప్తంగా పవన్ పర్యటించాలని తీసుకున్న నిర్ణయంతోనే సమస్య వచ్చిపడింది. అభిమానులు తప్ప పార్టీలో నేతలు లేరు, కార్యకర్తలు కూడా పెద్దగా లేరనే చెప్పాలి.

 

నిజానికి పవన్ కు బొత్తిగా ఓపిక లేదనే చెప్పాలి. అలాంటిది రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేయాలని డిసైడ్ చేయటం, అందులోను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలనుకున్న అంశాలు మరీ విచిత్రంగా ఉంది.  ఎన్నికలకు ముందు చేయాల్సిన పర్యటనల సమయంలోనే పవన్ పెద్దగా కనిపించలేదు. అలాంటిది ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఇపుడు పర్యటనలు చేసి ఉపయోగం ఏముంటుందో అర్ధం కావటం లేదు.

 

ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికలకు ముందు ఏడాది కాలం చాలా విలువైనదనే చెప్పాలి. అలాంటి సమయంలోనే ఒకవైపు చంద్రబాబునాయుడు, మరోవైపు చంద్రబాబునాయుడు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కాలమది. కానీ పవన్ మాత్రం  అప్పట్లోనే ఎక్కడా అడ్రస్ లేరు. గట్టిగా రెండు రోజులు జనాల్లో పర్యటిస్తే మళ్ళీ 20 రోజులు ఎక్కడా కనబడేవారు కాదు.

 

నిజంగా ఎన్నికల్లో పోటి చేయాలి మంచి ఫలితాలు సాధించాలన్న కసి, పట్టుదల పవన్ లో ఉన్నట్లు ఏ దశలోను కనబడలేదు. నియోజకవర్గాల్లో పోటికి అభ్యర్ధులను ఎంపిక చేసిన విధానం వల్లే మొత్తం 140 నియోజకవర్గాల్లో పోటి చేస్తే గెలిచింది ఒక్క చోటమాత్రమే. విచిత్రమేమిటంటే స్వయంగా రెండు చోట్ల పోటి చేసిన పవన్ రెండు చోట్లా ఓడిపోయారు.

 

 మొన్నటి ఎన్నికల్లో  వ్యవహారించిన  తీరు వల్లే రాజకీయాలను  పవన్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్దమైపోయింది. అలాంటిది మళ్ళీ నవంబర్ మొదటివారం నుండి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించారంటే ఎవరూ నమ్మటం లేదు. పైగా ఇసుక కొరత, మద్యం పాలసీ, ఏపిపిఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయటం లాంట అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారట.

 

జగన్ నూరు రోజుల పాలనలో ఒక్క ఇసుక పాలసిలో  మాత్రమే లోపాలున్నాయి. మద్యం పాలసీ, ఏపిపిఎస్సీ పరీక్షలో ఇంటర్య్వూల రద్దును అందరూ స్వాగతిస్తున్నారు. జనాలందరూ మెచ్చుకుంటున్న అంశాలపై పవన్ వ్యతిరేక ప్రచారమంటే ఇక పర్యటనలు సవ్యంగా జరిగినట్లే అని పార్టీ వాళ్ళే అనుకుంటున్నారు. చూద్దాం ఏ చేస్తారో.

 


మరింత సమాచారం తెలుసుకోండి: