దేశంలో ఎక్కడ చూసినా విషజ్వరాల ప్రజలను ప్రజలను కబళిస్తున్నాయి . వర్షాకాలం కావడంతో దోమలు ఈగలు స్వైర విహారం చేస్తూ ప్రజలను విషజ్వరాల బారిన పడేలా చేస్తున్నాయి .ఇక  రోజు రోజుకి విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ మాయదారి రోగాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాగా భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉండడం దింతో  దోమలు ఈగలు ఎక్కువయి ... అవి  ప్రజలపై దండయాత్ర చేయడం... ఇలాంటి వాటి వల్ల ప్రజలు డెంగ్యూ మలేరియా లాంటి మాయదారి రోగాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. 

 

 

 

 ఇంకొంతమంది ప్రజల ప్రాణాలు విష జ్వరాల బారిన పడి గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో అధికారులు ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా చర్యలు చేపడుతున్నారు. అపరిశుభ్ర పరిసరాలను గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టి ప్రజలను ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో ఇటీవలే డెంగ్యూ మలేరియా కేసులు ఎక్కువ నమోదవుతుండటంతో ... నివారణ చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు అక్కడి అధికారులు. అపరిశుభ్ర పరిసరాలను గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 

 

 

 

 

 రాష్ట్రంలో ఎక్కడా కూడా అపరిశుభ్రంగా కనిపించిన  సంస్థ లకు  గానీ కార్యాలయాలకు  గానీ కార్పొరేషన్ అధికారులు భారీ ఫైన్ విధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ ఫుడ్ డెలివెరీ సంస్థ జొమాటోకి  చెన్నై కార్పొరేషన్ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. నగరంలోని చెక్ పెట్  ఎంసీ నికల్సన్  రోడ్లోని ఓ  భవనంలో అపరిశుభ్ర వాతావరణంలో ఫుడ్ డెలివరీ సంస్థ యొక్క బ్యాగులను  గుర్తించిన కార్పొరేషన్ అధికారులు... జొమాటో సంస్థకి  లక్ష రూపాయల జరిమానా విధించారు. అంతేకాకుండా కార్యాలయాలు సంస్థలో అపరిశుభ్ర వాతావరణం ఉంటే  భారీ జరిమానాలు తప్పవని హెచ్చరిస్తున్న అధికారులు ... తమ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని విష జ్వరాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: