గోదావ‌రిలో మునిగిన బోటు ను వెలికితీయ‌డం క‌ష్టంగా మారిందా..?  గోదావ‌రి న‌దిలో పేరుకు పోయిన ఇసుక మేట‌లు, మ‌ట్టి దిబ్బ‌లు బోటు బ‌య‌టికి రాకుండా అడ్డు ప‌డుతున్నాయా...?  లంగ‌ర్లు బోటుకు త‌గిలినా ఎందుకు బోటు బ‌య‌టి రాకుండా పోతుంది.. దీనికి  కార‌ణం ఇసుక మేట‌లు కార‌ణ‌మా.. లేక లంగ‌ర్ లు బ‌లంగా బోటుకు చిక్కుకోక‌పోవ‌డ‌మేనా, ఇప్పుడు ఈ బోటుకు తీయాలంటే గ‌జ ఈత‌గాళ్ళు సాయం చేయాల్సిందేనా..?  మ‌రి ఎందుకు గ‌జ ఈత‌గాళ్ళ‌ను ర‌ప్పించ‌డం లేదు.. ఇలా బోటు ప్ర‌మాదంపై, వెలికితీత నెల‌ల త‌ర‌బ‌డి జ‌రుగుతున్నా ఎందుకు ప‌ని జ‌రుగ‌డం లేద‌నే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి..


అయితే ఇప్పుడు బోటును వెలికితీసేందుకు ధ‌ర్మాడి స‌త్యం మ‌రో కొత్త ఆలోచ‌న చేశార‌ట‌.. బోటు ఉన్న ప్రాంతం వ‌ద్ద‌కు దుబాసీల‌ను పంపి అక్క‌డ బోటుకు లంగ‌ర్‌ను గ‌ట్టిగా బంధిస్తే బ‌య‌టికి లాగడం ఈజీగా అవుతుంద‌ని ఆలోచన చేశార‌ట‌.. కానీ దుబాసీల‌ను న‌దిలోకి వెళ్లెందుకు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ట‌.. దీంతో ధ‌ర్మాడి స‌త్యం పోలీసులకు న‌డుమ వాగ్వాదం చోటు చేసుకుంద‌ట‌.. మ‌రి బోటుకు వెలికి తీత‌కు దుబాసీల‌కు పోలీసులు అనుమ‌తి ఇస్తారా.. ధ‌ర్మాడి స‌త్యం చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు స‌హ‌క‌రిస్తారా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


గోదావరిలో మునిగిన బోటు వెలికితీత కోసం దుబాసీల బృందం ఆదివారం  విశాఖ నుంచి దేవీపట్నం చేరుకుంది. దుబాసీలు నది లోపలకు వెళ్లి బోటుకు కొక్కేలు బిగిస్తే బోటు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో ఈ మేరకు విశాఖ నుంచి దుబాసీల బృందాన్ని దేవీపట్నం తీసుకువచ్చింది. వీరు నదిలోకి వెళ్లి బోటుకు కొక్కేలు తగిలిస్తారు. దీంతో బోటు బ‌య‌టికి రావ‌డం సులువుగా అవుతుంది. అయితే దుబాసీలు క‌చ్చ‌లూరు వెళ్ళేందుకు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌డం లేదు.


దీంతో ధ‌ర్మాడి స‌త్యం బృందం దుబాసీల కోసం ఓ ప్రత్యేక బోటు ఏర్పాటు చేయాల‌ని, బోటుకు లంగ‌ర్లు త‌గిలించి బోటుకు బ‌యటకు తీసేందుకు ఇంత‌క‌న్నా మ‌రోమార్గం లేద‌ని స‌త్యం వాధిస్తున్నారు. కానీ పోలీసులు దుబాసీల‌కు ఏమైనా అయితే దానికి ఎవ్వ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని వాదిస్తున్నారు. దీంతో బోటు వెలికితీత‌పై అటు స‌త్యం, ఇటు పోలీసుల న‌డుమ పీట ముడి ప‌డింది.


మరింత సమాచారం తెలుసుకోండి: