హుజూర్ నగర్లో ఉపఎన్నిక షురూ అయ్యాయి. ఇక ఈ ఉప పోరు ఇద్దరి రాజకీయ జీవితాలను ప్రభావితం చేయనున్నది. అధికార పార్టీ విజయమా.. ప్రతిపక్ష పార్టీకి విజయమా.. అనేది ఉత్కంఠంగా మారింది.. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఇకపోతే ఈ ఉప ఎన్నికల్లో ఎవరి సత్తా ఎలా ఉందో తేలనుంది. ఈ హుజూర్‌నగర్ బరిలో 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా. మొత్తం 302 పోలింగ్ కేంద్రాలు.. 1708 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 2,36,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 79 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించిన అధికారులు..


ప్రతి పోలింగ్‌ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు.అలాగే 3,350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కనీసం 10 నుంచి15 మంది పోలీసులు, ఉండగా వీరిలో 5 నుంచి 10 మంది సాయుధులు ఉన్నారు. ప్రతి మండలానికి ఒక డీఎస్పీని బాధ్యులుగా నియమించారు. ఇకపోతే ఓటు హక్కును వినియోగించుకుందామని వచ్చే ఓటర్లకు తిప్పలు తప్పేలా లేవు. ఓటు వేసే పోలింగ్ సెంటర్‌లో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


అధికారులు సరైన దిశలో ఏర్పాట్లు చేసామని చెబుతున్న పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. నేరేడుచర్లలో 31,33 పోలీంగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో అక్కడ ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మిగతా చోట్ల ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్  అమలుచేసిన అధికారులు. అన్నిచోట్ల సీసీకెమెరాల ఏర్పాటు. ఇకపోతే మటంపల్లి మండలం గుండ్లవల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇకపోతే ఈ ఎన్నిక ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు - పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నిక ఇద్దరి రాజకీయ జీవితానికి జీవన్మరణ సమస్యగా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: