మహారాష్ట్రలోని 288, హర్యానాలోని 90 సీట్లతోపాటు ఉప ఎన్నికలు జరుగనున్న 18 రాష్ర్టాల్లోని 51 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ సీట్లకు పోలింగ్ ప్రారంభ‌మైంది. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  మహారాష్ట్ర, హర్యానాల్లో అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తుండగా.. అధికారం దక్కించుకొని లోక్‌సభ ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు పోరాడుతున్నాయి. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.  లోక్​సభ ఎన్నికలు పూర్తయిన ఆరు నెలల్లోపే ఈ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో అక్టోబర్​ 24న వెలువడే ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రెండు రాష్ర్టాల్లో కలిపి దాదాపు నాలుగు లక్షల మంది భద్రతా బలగాలను మోహరించారు. రెండు రాష్ర్టాల్లో కలిపి మొత్తం 10,81,22,170 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. 4,406 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 1.16 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1.62 లక్షల వీవీప్యాట్లను వినియోగిస్తున్నారు. 


మహారాష్ట్ర మొత్తం సీట్లు  288
మొత్తం అభ్యర్థులు 3,237
స్వతంత్ర అభ్యర్థులు  1,400
పార్టీలు పోటీ చేస్తున్న సీట్లు
బీజేపీ           164
శివసేన          124
కాంగ్రెస్​          147
ఎన్సీపీ          121


హర్యానామొత్తం సీట్లు  90
మొత్తం అభ్యర్థులు 1,169
ఇండిపెండెంట్లు     375
పార్టీలు పోటీ చేస్తున్న సీట్లు
బీజేపీ             90
కాంగ్రెస్            90
ఐఎన్ఎల్​డీ       81
బీఎస్పీ    87



మరింత సమాచారం తెలుసుకోండి: