చంద్రబాబునాయుడు అండతో చెలరేగిపోయిన నవయుగ కంపెనీ దోపిడి ఒకటి తాజాగా బయటపడింది. ప్రభుత్వ భూములను సొంతం చేసుకున్న కంపెనీ చెప్పిన పని చేయకుండా భూములను తాకట్టుపెట్టి  ఏకంగా రూ. 1900 కోట్లు బ్యాంకుల నుండి అప్పలు తీసుకున్న విషయం బయటపడింది. ఒక్క నవయుగ కంపెనీ చేసిన దోపిడినే ఇంతుంటే ఇక చంద్రబాబు మద్దతుతో చెలరేగిపోయిన మిగిలిన కంపెనీల మాటేమిటి ?

 

ఇంతకీ విషయం ఏమిటంటే నెల్లరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవుకు 6 కిలోమీటర్ల దూరంలో మల్టి ప్రొడక్ట్ సెజ్ ఏర్పాటు పేరుతో కంపెనీ 2009లో ప్రభుత్వం నుండి 4731 ఎకరాలు తీసుకుంది. సెట్ ఏర్పాటు చేసి పరిశ్రమలను ఏర్పాటు చేసి వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చి కంపెనీ భూములు తీసుకున్నది.

 

అయితే భూములు సొంతం చేసుకున్న తర్వాత పదేళ్ళ పాటు అంటే 2019 వరకు కూడా సెజ్ లో కనీసం ఒక్క ఇటుకను కూడా వేసిన పాపాన పోలేదు. అంటే పరిశ్రమలూ లేవు. పరిశ్రమల పేరుతో చెప్పిన ఉద్యోగాలు, ఉపాధి కూడా లేదు. మరి అన్ని వేల ఎకరాల భూమిని ఏం చేసింది కంపెనీ ?

 

తీసుకున్న భూమిని ఏమి చేసిందంటే మొత్తాన్ని బ్యాంకుల్లో తాకట్టుపెట్టేసింది. ఐసిఐసిఐ బ్యాంకు నుండి రూ. 400 కోట్లు, సెంట్రల్ బ్యాంకు నుండి రూ. 250 కోట్లు, అలహాబాద్ నుండి రూ. 200 కోట్లతో పాటు ఇతర ఆర్ధిక సంస్ధల నుండి ఓ వెయ్యి కోట్లు అప్పులు తీసుకుంది. విచిత్రమేమిటంటే బ్యాంకుల నుండి అప్పులు తీసుకోవాలంటే భూములిచ్చిన ఏపిఐఐసి నుండి కంపెనీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల నుండి వందల కోట్లు అప్పులు తీసుకుంది.

 

సరే అప్పట్లో ప్రత్యేక తెలంగాణా గొడవలు తారాస్ధాయిలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. 2014లో చంద్రబాబునాయుడు సిఎం అయిన తర్వాత కూడా పట్టించుకోలేదు. పైగా పోలవరం ప్రాజెక్టును కూడా నామినేషన్ పై ఇచ్చేసి నవయుగను బాగా ప్రోత్సహించారు. భూములు తీసుకుని తాకట్టు పెట్టిన విషయం ఏపిఐఐసి, పరిశ్రమలు, ఆర్దికశాఖల తనిఖీల్లో బయటపడింది. అదే విషయాన్ని ఓ ఫైలు రూపంలో రాసి యాక్షన్ తీసుకోవాలని చెబితే చంద్రబాబు తొక్కిపెట్టారు. అదే ఫైలుపై తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం భూముల కేటాయింపులను రద్దు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: