మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి కొణిదెల ఉపాస‌న చేసిన ప‌నికి దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ దిమ్మ తిర‌గాల్సిందే. మంచిని మంచిగా చెడును చెడుగా చూడాల్సిన ప్ర‌ధాని, దేశాన్ని మొత్తం త‌నకు ఒక‌టే అని చాటాల్సిన ప్ర‌ధాన‌మంత్రి, ఉత్త‌ర ద‌క్షిణ ప్రాంతాలను వేర్వేరు ప్రాంతాలుగా చూడ‌కుండా త‌న‌కు రెండు క‌ళ్ళుగా చూసుకోవాల్సిన ప్ర‌ధాని, ఒక‌రు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ కాకుండా చూసుకోవాల్సిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చేసిన చ‌ర్య‌కు ఇప్పుడు ఓ ప్రాంతంలోని కొంద‌రు అగ్గిమీద గుగ్గిళం అవుతున్నారు.


అంతేకాదు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ చ‌ర్య‌ను త‌ప్పుప‌డుతున్నారు కూడా. కానీ ఏకంగా మెగా ఇంటి కోడ‌లు ఉపాస‌న మాత్రం ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీకు దిమ్మ‌తిరిగే ప‌నిచేసింది. ఇంత‌కు ఉపాస‌న ఎందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి దిమ్మ‌తిరిగే ప‌నిచేసింది.. అస‌లు చేసిన ప‌నేంటీ.. అనుకుంటున్నారా...  150వ గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ బాలీవుడ్ న‌టుల‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించి వారిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. దీంతో ద‌క్షిణ భార‌త‌దేశంలోని సిని ప‌రిశ్ర‌మ ప్ర‌ధాని వ్య‌వ‌హ‌రంపై దుమ్మెత్తి పోస్తుంది.  


ఏకంగా  ఉపాస‌న మాత్రం నేరుగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీకి త‌న నిర‌స‌న‌ను, ద‌క్షిణ భార‌తంలో ఉన్న సిని ప‌రిశ్ర‌మ‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం త‌గ‌దంటూ మెసేజ్ పెట్టింది.. ఉపాస‌న మెసేజ్ సారంశం ఇలా ఉంది... డియర్ నరేంద్ర మోదీ గారు, మేము సౌత్ ఇండియన్స్.. మీ పాలనని అభిమానిస్తూ, మీరు ప్రధానిగా ఉన్నందుకు గర్వంగా ఫీలవుతాం. కానీ మీ దృష్టిలో సినీ సెలబ్రిటీస్ మరియు కల్చరల్ ఐకాన్స్ కేవలం హిందీకి మాత్రమే పరిమితమా.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ విషయం నన్ను ఎంతో బాధ పెట్టింది. అందుకే ప్రశ్నిస్తున్నా.. ఇది మీకు కరెక్ట్ గా రీచ్ అవుతుందని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశారు.


భార‌త దేశంలో సిని ప‌రిశ్ర‌మ ప్ర‌తి రాష్ట్రంలో ఎంతో బ‌లంగా ఉంది. ఉత్త‌ర భార‌త‌దేశంలోని సిని ప‌రిశ్ర‌మ‌ను బాలీవుడ్‌గా పిలుస్తున్నారు. కానీ ద‌క్షిణ భార‌తంలోని సిని ప‌రిశ్ర‌మ ఎంతో బ‌ల‌మైంది. అందులో తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాళం, క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లు చాలా పెద్ద‌వి కూడా. అయితే దేశం గ‌ర్వించేలా ద‌క్షిణ భార‌తానికి చెందిన ద‌ర్శ‌కులు, హీరోలు, సంగీత ద‌ర్శ‌కులు ఉన్నారు. అస్కార్ అవార్డు పొంది దేశానికే ఖ్యాతి తెచ్చిన ఎఆర్ రెహామాన్ ద‌క్షిణ భార‌తానికి చెందిన వ్య‌క్తే.. ఇక రోబో పేరుతో సినిమా తీసిన ద‌ర్శ‌కుడు శంక‌ర్‌, ఆ సినిమా హీరో సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్, ప్ర‌ముఖ హీరో క‌మల‌హాస‌న్‌, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాహుబ‌లి ద‌ర్శ‌కుడు రాజ‌మౌళీ ఇలా చెప్పుకుంటూ పోతే ద‌క్షిణ భారతంలో కూడా ఎంద‌రో న‌టీ న‌టులు ఉన్నారు. ద‌ర్శ‌కులు, సంగీత ద‌ర్శ‌కులు ఉన్నారు.


కానీ దేశ ప్ర‌ధాన‌మంత్రి కేవలం బాలీవుడ్ నే దేశానికి సిని ప‌రిశ్ర‌మ‌గా చూడ‌టం ప‌ట్ల ఉపాస‌న‌కు కోసం వ‌చ్చింద‌ట‌. అందుకే ఉపాస‌న ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీకీ ట్వీట్ చేసింది. ఉపాస‌న చేసిన ట్వీట్‌తోనైనా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ లో కొంతైనా చ‌ల‌నం వ‌స్తుంద‌ని, త‌ద్వారా ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త సిని ప‌రిశ్ర‌మ‌లుగా విభ‌జించ‌కుండా దేశ‌మంతా సిని ప‌రిశ్ర‌మ ఒక్క‌టే అనే తీరుగా స్పందిస్తార‌ని ఆశిద్దాం. ఇక ఇటు మోదీని మెగా కోడలు ఇలా టార్గెట్ చేయ‌డంతో ఆమె పోస్టు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో హైలెట్ అవుతోంది. ప‌లువురు ఆమె ధైర్యాన్ని ప్ర‌శంసిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: