తెలంగాణ‌లో ఆర్టీసీ స‌మ్మె ఉధృతం అవుతూనే ఉంది. ఇప్ప‌టికే 17వ రోజుకు ఆర్టీసీ సమ్మె చేరుకుంది. ఈనెల 19న ఆర్టీసీ స‌మ్మెలో భాగంగా తెలంగాణ బంద్‌కు పిలుపు నిచ్చింది. ఈ బంద్ శ‌నివారం విజ‌య‌వంతం అయింది. దీంతో ఆర్టీసీ కార్మికుల్లో ఎక్క‌డ లేని జోష్ వ‌చ్చింది. అందుకే ప్ర‌భుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకే ఆర్టీసీ కార్మికులు సిద్ద‌మ‌యిన‌ట్లున్నారు. అందుకే  ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా స‌మ్మె కొన‌సాగుతూనే ఉంది. అయితే 17రోజులుగా జ‌రుగుతున్న స‌మ్మె ఈ రోజు ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డించాల‌ని నిర్ణ‌యించారు. అందుకు ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ నేత‌లు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ముట్ట‌డిస్తార‌నే భ‌యంతో తెలంగాణ పోలీసులు భారీగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను కాపాలా కాస్తున్నారు.


తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు పోలీసుల బందూకుల నీడ‌లో పాల‌న చేస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ను దాదాపుగా వంద‌లాది మంది పోలీసులు కాపాలా కాస్తున్నారు. అయితే ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద ఎలాంటి ఆవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా ఆ ప్రాంతాన్ని పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. పంజాగుట్ట‌, బేగంపేట‌, ఖైర‌తాబాద్, సోమాజీగూడ ప్రాంతాల‌ను పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. ఖైర‌తాబాద్ మెట్రో రైల్వే స్టేష‌న్‌ను మూసి వేశారు. పోలీసులు ప్ర‌గ‌తిభ‌వ‌న్ ప‌రిస‌రాల‌ను త‌మ అదుపులోకి తీసుకుని పెట్రోలింగ్ చేస్తున్నారు.


ఇక ఆర్టీసీ కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల ముందు ధ‌ర్నా చేస్తున్నారు. కార్మీకులు విధుల్లోకి వెళ్ళ‌డం మానేసారు. ఇక ఈరోజు ద‌స‌రా సెలవులు ముగియ‌డంతో స్కూళ్ళు, కాలేజ్‌లు మ‌ళ్ళీ తెరుచుకున్నాయి. అయితే విద్యార్థుల‌కు స‌రిప‌డా బ‌స్సులు లేక‌పోవ‌డంతో నానా ఇబ్బందులు ప‌డ్డారు విద్యార్థులు. ఏదేమైనా ఆర్టీసీ స‌మ్మె ఎఫెక్ట్‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్ గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుంద‌నే చెప్ప‌వ‌చ్చు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద పోలీసులు ఏకంగా 144సెక్ష‌న్ విధించినట్లు స‌మాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: