హైదరాబాద్ లో ఓ మెట్రో స్టేషన్ మూసివేశారు. భద్రతా కారణాల దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసేశారు. ఈ విషయాన్ని మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రతి స్టేషన్ లోను ప్రయాణికుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడానికి మెట్రో టికెట్ పై బేగంపెట్ మెట్రో స్టేషన్ మూసివేశారని, అక్కడ రైలు ఆగదని ముద్రించారు.      

                     

టికెట్ తీసుకునే సెంటర్ వద్ద నోటీసులు అంటించి ప్రయాణికులకు తెలియజేస్తున్నారు. దీంతో బేగంపేట్ సమీపంలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వైపు బస్సులు లేక ఇబ్బంది ఉంటె ఇప్పుడు మెట్రో కూడా లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.        

                    

కాగా ఈరోజే 20 రోజుల దసరా సేలువల తర్వాత స్కూల్స్, కాలేజీలు కూడా తెరుచుకున్నాయి. అయితే ఈరోజు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ నాయకులూ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బేగంపేట్ మెట్రో మూసివేయాలని మెట్రో యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.         

                    

బేగంపేట మెట్రో స్టేషన్ ప్రగతి భవన్‌కు దగ్గరలోనే ఉండటం వల్ల ఆందోళనకారులు అక్కడి నుంచి ముట్టడికి ప్రయత్నించే అవకాశం ఉందని ముందస్తు చర్యల్లో భాగంగానే స్టేషన్‌ను మూసేశారని అధికారులు చెప్తున్నారు. కాగా ప్రగతిభవన్ దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

               

మరింత సమాచారం తెలుసుకోండి: