ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె  కారణంతో 23 రోజులు తర్వాత తిరిగి మళ్ళి నేడు  పునఃప్రారంభం అయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు కూడా సమాయత్త అవుతున్నారు. ఇంకా  ఆర్టీసీ సమ్మె జరుగుతుండంతో గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులుకు, దూరప్రాంత పాఠశాలలకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే విద్యార్థులు బాగా ఇబ్బందులు పడుతున్నారు.


నిజానికి బుతకమ్మ, దసరా పండుగ సందర్భంగా విద్య సంస్థలకు విద్యాశాఖ ముందుగా సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 13 వరకు సెలవులు అని తెలిపారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి నిరవధిక సమ్మెను మొదలు పెట్టారు. 14న పాఠశాలలు పునఃప్రారంభం అవ్వాలి, కానీ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యాశాఖ మరోసారి పాఠశాలలకు ఈనెల 14 నుంచి ఈనెల19 వరకు పొడకించడం జరిగింది. దీంతో ఏకంగా విద్యాసంస్థలు 23 రోజులపాటు సెలవులు ఉండడంతో విద్యార్థుల పరిస్థితి కూడా ఆందోళనగా ఉంది.


ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు కేవలం 40 శాతం వరకే సిలబస్‌ పూర్తయినట్లు అధికారులు తెలియచేసారు. నిజానికి అక్టోబర్‌ చివరి నాటికి 50 శాతంపైగా సిలబస్‌ పూర్తి అవ్వాలి. పదో తరగతి విద్యార్థులకు నవంబర్‌ మొదటి వారం నుంచే స్టడీ అవర్స్‌ నిర్వహించాలనేది రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌లో తెలిపారు. 


ఇక ఆర్టీసీ సమ్మె ప్రారంభమైనప్పటి ప్రధాన రూట్లలోనే బస్సులు నడుస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్‌  1, 2 డిపోలతోపాటు, హుజూరాబాద్, డిపోల నుంచి హైదరాబాద్, గోదావరిఖని, సిరిసిల్ల, వేములవాడ, మంచిర్యాల లాంటి ప్రధాన రూట్లలోనే బస్సులు నడుస్తున్నాయి. ఇక ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన రూట్లకే అధికారులు బస్సులను పంపిస్తున్నారు.ఇప్పటికైనా  ఆర్టీసీ అధికారులు స్పందించి విద్యార్థుల చదువును దృష్టిలో పెట్టుకొని  పల్లెలకు బస్సులు నడిపించాలని కోరడం జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: