భారత్, పాకిస్థాన్ మధ్య ‘స్నేహ వారధి’గా అభివర్ణిస్తున్న ‘కర్తార్‌పూర్ కారిడార్’ ఇప్పుడు ఇరుదేశాల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిపాదిత ఈ మార్గం ద్వారా మన సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి పాక్‌లోని కర్తాపూర్‌కు నేరుగా రాకపోకలు సాగించడానికి వీలు కలుగుతుంది. ఇదే దీని విశిష్టత.

భారత్, పాక్ మధ్య ఏళ్లుగా చర్చల దశలో ఉన్న ఈ కలల ప్రాజెక్టు ఎట్టకేలకు వాస్తవ రూపం దాలుస్తుండటంతో సరిహద్దుకు ఇరువైపుల ఉన్న సిక్కు ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. కర్తార్‌పూర్ సాహిబ్ అనేది పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో రావి నది ఒడ్డున ఉన్న ఓ ప్రముఖ గురుద్వారా. సిక్కులు దీన్ని పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. సిక్కుల మతగురువు గురునానక్ తన జీవితంలోని చివరి 18 ఏళ్లు ఇక్కడే గడిపారు. ఇక్కడే తుదిశ్వాస విడిచారు. అందుకే ఈ గురుద్వారాకు అంత ప్రధాన్యం.అయితే.

. విభజనతో ఈ ప్రాంతం పాక్ భూభాగంలో కలవడంతో భారత్‌లోని పంజాబ్ ప్రాంత సిక్కులు నిరాశకు గురయ్యారు. నాటి నుంచి అతికష్టం మీద ఇక్కడకు రాకపోకలు సాగిస్తున్నారుపూర్తి అయినా.కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హాజరుకారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి

. అయితే సాధారణ యాత్రికుడిలాగా మన్మోహన్‌ అక్కడికి వెళ్తారని ఆదివారం పేర్కొన్నాయి. కాగా, పాక్‌ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమూద్‌ ఖురేషీ కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి రావాలని తాము పంపిన ఆహ్వానాన్ని మన్మోహన్‌ అంగీకరించారని ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు వెల్లడించాయి.నవంబర్‌ 9న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన్మోహన్‌ ఒక ప్రత్యేక అతిథిగా కాకుండా, ఒక సాధారణ వ్యక్తిగా హాజరవుతారు’ అని అక్కడి స్థానిక వార్తాపత్రిక డాన్‌ పేర్కొంది. పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని సిక్కు జాతా ప్రతినిధుల బృందంతో పాటు మన్మోహన్‌ సింగ్‌ పాల్గొననున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: