మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  ఈ ఉదయం నుంచి పోలింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈ ఉదయం నుంచే ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ కు చేరుకొని క్యూలో నిలబడ్డారు.  క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  ఉదయం నుంచే సెలెబ్రిటీలు కూడా పోలీస్ బూత్ లకు చేరుకొని ఓటు వేస్తున్నారు.  ఈ ఉదయాన్నే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, రితేష్ దేశ్ ముఖ్, జనీలియా, లారా దత్తా, మహేష్ భూపతి, మాధురి దీక్షిత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  


ఉదయం నుంచి ఎన్నికల్లో జోష్ కనిపిస్తోంది.  పెద్ద ఎత్తున ప్రజలు పోలీస్ బూత్ లకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.  ఎప్పుడు నగరాల్లో పోలింగ్ మందకొడిగా జరుగుతుంటుంది.  కానీ, ఈసారి ముంబైలో యూత్ ఎక్కువగా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ముంబైతో పాటుగా మిగతా ప్రాంతాల్లో కూడా పోలింగ్ చురుగ్గా సాగుతున్నది.  ముంబైలో యూత్ ఎక్కువగా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటింగ్ వేస్తుంటే.. మిగతా ప్రాంతాల్లో పెద్దలు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, గత కొన్ని రోజులుగా మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి.  కొన్ని చోట్ల ఇంకా వర్షం కురుస్తూనే ఉన్నది.  ఆ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి లైన్లో నిలబడుతున్నారు. ఓటు రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం అని, దానిని వినియోగించుకోవడం తమ హక్కు అని చెప్పి ఓటు వేస్తున్నారు.  ఓటు హక్కును వినియోగించుకుంటూన్నారు.  


పెద్దలు సైతం అలానే వర్షంలో తడుస్తూనే ఓటు వేస్తున్నారు.  సంగ్లి, నాసిక్, పూణే, ఔరంగాబాద్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్నది.  ఈ వర్షాన్ని లెక్కచేయకుండా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం చూస్తుంటే.. ఓటుపై వారికీ ఎంతటి నిబద్దత ఉన్నదో అర్ధం అవుతున్నది.  ఇక ఇదిలా ఉంటె, కేరళలోని ఐదు అసెంబ్లీ నియోజకా వర్గాల్లో ఉప ఎన్నిక జరుగుతున్నది.  వట్టియారుకావు, అలప్పుజలోని ఆరూర్, పట్నింతిట్టతో పాటు ఎర్నాకులం, మాజేశ్వరం నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: