ప్రస్తుతం హాట్ టాపిక్ హుజూర్‌నగర్ ఉపఎన్నికలు.. ఎన్నికల ముందు నుండి ఉత్కంఠగా మారిని ఈ ఉపఎన్నికలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి.. ఈరోజు జరగనున్న ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 24 న వెలువడనున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఉదయం నుండి ప్రారంభమైన ఈ ఎన్నికలు ప్రస్తుతానికి ప్రశాంతంగానే జరుగుతున్నాయి. ఇకపోతే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. అటువంటి ప్రాంతాల్లో తెరాస పరిస్థితి ఏంటా అని అందరు ఆలోచనలో పడ్డారు.. 


తెరాస కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుందన్న విషయం తెలిసిందే.. ఆర్టీసీ సమ్మె కారణంగా గులాబీ దళాలు తోకముడుచుకున్నాయి. ఈ సమ్మె జరగక ముందు మాటకొస్తే హుజూర్‌నగర్ లో తెరాస హావా కొనసాగింది. ఈ సమ్మె కారణంగా గులాబీల పరిస్థితి వాడిపోయింది.. ఇదే అదునుగా చూసుకున్న కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో దృష్టిసారించింది. చింతచచ్చిన పులుపు తగ్గలేదు అన్నట్లు చుట్టూ ఉచ్చులు ఉన్న కూడా తెరాస నేతలు గెలుపు మాదే అన్న ధీమాతో వ్యవహరించడం అందరిని షాక్ కి గురిచేస్తుంది. 


ఈ ఎన్నికల బరిలో బిజెపి, టీడీపీ కూడా ఉండటంలో తెరాస కొంచం ఊరట తీసుకున్న కూడా.. స్వతంత్ర అభ్యర్థుల దాటికి తెరాస వెనకడుగు వేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారి ఎన్నికల గుర్తులు రోడ్డు రోలర్, ట్రాక్టర్ గుర్తులు కావడంతో తెరాస నేతలకు వణుకుపుడుతుంది. ఈ రెండు గుర్తులు కారు గుర్తుకు దగ్గరగా ఉండటమే అందుకు మెయిన్ కారణమట. 


ఈవీఎం లపై కూడా కారు, ట్రాక్టర్, రోడ్డు రోలర్ గుర్తులకు పెద్దగా తేడా లేకపోవడంతో వయో వృద్దులు, కళ్ళు సరిగా లేనివారు గుర్తించలేకపోవడనేది జరగడం సర్వ సాధారణం. ఈ సమస్య అనేది తెరాస నాయకులకు భయం పుట్టిస్తుంది కూడా.. అందుకే ఉదయం పోలింగ్ కేంద్రాల దగ్గర తెరాస నాయకులు హెచ్చరిస్తున్నారు. మరి గెలుపు ఎవరి అనేది ఉత్కంఠగా మారింది.. ఇప్పటివరకు పోలింగ్ శాతం ఓ మాదిరిగా నమోదు అయింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: