మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాలతో పాటు దేశంలోని కొన్ని నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో హుజూర్ నగర్ ఒకటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఆ తర్వాత ఎంపీగానూ గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక వచ్చింది.


అయితే ఇక్కడి ఉపఎన్నికల పోలింగ్ లో ఓ విచిత్రం చోటు చేసుకుంటోంది. ఉదయం నుంచి ఇక్కడ ఓటింగ్ మందకొడిగా కొనసాగుతోంది. అయితే ఉదయం 11 గంటల వరకూ ఇక్కడ కేవలం 30 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. పోలింగ్ సరళిని పరిశీలిస్తే,.. కొన్ని నియోజకవర్గాల్లో జనం బారులు తీరగా.. మరికొన్ని కేంద్రాల్లో మాత్రం అసలు జనమే కనిపించడలేదు.


ఎందుకు ఇలా జరిగిందని ఆరా తీస్తే.. మరోషాకింగ్ వాస్తవం వెలుగు చూసింది. ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య హోరాహోరీ పోరు ఉండటంతో నాయకులు డబ్బు పంపకం జోరు పెంచారట. ఓటర్లు కూడా నాయకులు కచ్చితంగా ఎక్కువగా డబ్బు ఇస్తారన్న అంచనాలతో ఉన్నారట. ఇంకా చాలా ప్రాంతాల్లో ఏ పార్టీ కూడా డబ్బు పంచలేదట.


కొన్ని పార్టీలు ఓటింగ్ కు వెళ్లే ముందు పంచుతున్నాయట. అందుకే చివరి నిమిషం వరకూ వేచి చూసి.. ఏ పార్టీ ఎక్కువ డబ్బు ఇస్తే ఆ పార్టీకి ఓటు వేద్దామని ఓటర్లు ఎదురు చూస్తున్నారట.


అందుకే ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఓటర్ల సందడి కనిపించడం లేదు. సాయంత్రం ఐదు గంటల వరకూ ఓటేసే అవకాశం ఉంది కాబట్టి.. చివరి నిమిషం వరకూ వేచిచూసేందుకు కొందరు ఓటర్లు డిసైడయ్యారట. మరి జనం ఈ రేంజ్‌లో ఆలోచిస్తే.. గెలిచాక నాయకులు కూడా జనం గురించి ఎందుకు పట్టించుకుంటారు చెప్పండి. జనం ఫ్యూచర్ గురించి కాకుండా.. ఈరోజు ఎంత వస్తుందనే ఆలోచనలో ఉన్నారు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: