హర్యానా రాష్ట్రంలో జరిగే పోలింగ్ సాయుధ పోలీసుల పహరా మధ్య సోమవారం ప్రశాంతంగా సాగుతోంది. ఈ రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 1169 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాగా బీజేపీ పక్షాన సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కాంగ్రెస్ పక్షాన మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, జేజపా పక్షాన దుష్యంత్ చౌతాలా, ఐఎన్ఎల్ డి తరపున అభయ్ సింగ్ చౌతాలాలు రంగంలో నిలిచారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ 75 సీట్లలో విజయం సాధించి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని చూస్తుండగా,  కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు తీవ్ర కృషిచేస్తుంది..


ఇక మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీలకు జరుగుతున్న పోలింగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మోదీ కోరారు. అలాగే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని చోట్ల రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదు చేసి ప్రజాస్వామ్య పండగను సుసంపన్నం చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ కూడా చేశారు. ఇకపోతే 


మహారాష్ట్రలో: బీజేపీకి చెందిన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ (నాగ్‌పూర్‌–నైరుతి),  కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రులు అశోక్‌ చవాన్‌ (భోకర్‌), పృథ్వీరాజ్‌ చవాన్‌ (కరాడ్‌)  శివసేనకు చెందిన ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (వర్లి) పోటీలో ఉండగా,
హరియాణాలో: సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (కర్నాల్‌), కాంగ్రెస్‌ మాజీ సీఎం భూపీందర్‌ సింగ్‌ హూడా (గర్హి సంప్లా–కిలోయి), రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా (కైతాల్‌), కుల్దీప్‌ బిష్ణోయి (ఆదమ్‌పూర్‌), దుష్యంత్‌ చౌతాలా (ఉచన్‌కలాన్‌) బరిలో నిలిచారు.


ఉదయం 12 గంటల వరకు హరియాణాలో 25.12 శాతం, మహారాష్ట్రలో 18.34 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ప్రశాంతంగా ఓటర్లు ఓట్లు వేస్తున్నారని అధికారులు తెలిపారు...


మరింత సమాచారం తెలుసుకోండి: