నేటి తరం యువతలో చాలా మంది ట్రేడింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. అత్యాధునిక ఆల్గో ట్రేడింగ్‌ సాఫ్ట్‌వేర్‌లు., మొబైల్‌ నుంచే అన్ని రకాల సేవలు, విస్తృతమైన సమాచారం ఇవన్నీ ట్రేడింగ్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. అయితే ట్రేడింగ్‌ను ఓ ప్రొఫెషన్‌గా ఎంచుకున్నవారు దీనికి చెందిన పన్ను బాధ్యతలను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారు., స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ ఆదాయాన్ని చూపించడం, పన్ను చెల్లించడం ఇప్పుడు తప్పనిసరి.

 

'ఇంట్రా డే ట్రేడింగ్‌'  అంటే ఒకే రోజు కొని, అమ్మేయడం ద్వారా వచ్చే లాభ/నష్టాలను వ్యాపార ఆదాయంగా చట్టం పరిగణిస్తుంది. వృత్తి/వ్యాపారం ద్వారా వచ్చిన లాభాలుగా వీటిని చూపించాల్సి ఉంటుంది. ట్రేడింగ్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పెక్యులేటివ్, నాన్‌ స్పెక్యులేటివ్‌ అని రెండు విధాలుగా విభజిస్తారు. ఈక్విటీలో ఇంట్రాడే ట్రేడింగ్‌పై వచ్చే లాభ, నష్టాలను స్పెక్యులేటివ్‌గా..,, ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌అండ్‌వో) ద్వారా వచ్చే లాభ, నష్టాలు నాన్‌ స్పెక్యులేటివ్‌గా తెలుపుతారు. ఈ స్పెక్యులేటివ్, నాన్‌ స్పెక్యులేటివ్‌ లాభాలన్నవి మీ పన్ను వర్తించే ఆదాయానికే కలుస్తాయి. మీ ఆదాయ శ్లాబును బట్టి పన్ను చెల్లించడం జరుగుతుంది.

 

అయితే, వ్యాపార ఆదాయం కింద చూపించే స్పెక్యులేటివ్, నాన్‌ స్పెక్యులేటివ్‌ లాభాల నుంచి, మీకు అయిన ఖర్చులను మినహాయించుకుని..,, అంటే బ్రోకర్ల కమీషన్, డిమాట్ చార్జీలు, ఇంటర్నెట్‌ ఖర్చులు ఇవన్నీ కూడా ట్రేడింగ్‌ కోసం చేసిన ఖర్చులే కనుక మొత్తం లాభాల్లో ఈ ఖర్చులను తీసేసిన తర్వాత మిగిలిన ట్రేడింగ్‌ ఆదాయాన్ని పేర్కొంటే సరిపోతుంది. ఒకవేళ నష్టాలు వస్తే మాత్రం స్పెక్యులేటివ్, నాన్‌ స్పెక్యులేటివ్‌ ఆదాయంపై పన్ను వేర్వేరుగా ఉంటుంది. ఎఫ్‌అండ్‌వో నుంచి నాన్‌ స్పెక్యులేటివ్‌ రూపంలో నష్టం వచ్చినట్లయితే ఈ నష్టాన్ని సంబంధిత వ్యక్తి వేతనం మినహా ఇతర ప్రధాన ఆదాయం నుంచి సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. అప్పటికీ నష్టం మిగిలిపోతే దాన్ని తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల కోసం బదలాయించుకొని ఎప్పుడైనా ఈ 8 ఏళ్లలో పన్ను భారం తగ్గించుకోవచ్చు. స్టాక్‌ ట్రేడింగ్‌ ఆదాయం వ్యాపార ఆదాయం అవుతుంది కనుక ఆదాయపన్ను చట్టం ప్రకారం వ్యాపార ఆదాయం రూ.కోటి దాటితే ఆడిట్‌ కూడా తప్పనిసరి అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: