లాటిన్ అమెరికాలోని అత్యంత సుస్థిరమైన దేశాల్లో ఒకటి చిలీ. కానీ దేశంలో పెరుగుతున్న జీవన వ్యయం పట్ల ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తికి ఈ ఆందోళనలు అద్దం పడుతున్నాయి.దేశ రాజధాని శాంటియాగో రెండు రోజులుగా హింసాత్మక ఆందేళనలతో అట్టుడుకుతోంది.చిలీలో మెట్రో రైలు చార్జీలు పెంచటంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయిఆందోళనల నేపథ్యంలో మెట్రో రైలు చార్జీల పెంపును రద్దు చేస్తున్నట్లు దేశాధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా ప్రకటించారు. అయినా నిరసనలు కొనసాగాయి.చిలీ కొన్ని దశాబ్దాలుగా ఇంత తీవ్రస్థాయి అశాంతిని చవిచూడలేదు. దేశ ప్రజల్లో ఉన్న చీలికలు కూడా ఈ ఆందోళనలతో బహిర్గతమయ్యాయి.


శాంటియాగో నగరం నడిబొడ్డున ఘర్షణలు చెలరేగాయి. పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని మేయర్ ఫెలిప్ అలెస్సాండ్రి అభివర్ణించారు.శాంటియాగోలోని కొన్ని ప్రాంతాల్లో వందలాది మంది సైనికులను రోడ్ల మీద మోహరించారు. అగస్టో పినోచెట్ నియంతృత్వ పాలన నుంచి 1990లో ప్రజాస్వామ్య దేశంగా మారిన తర్వాత.. ఈ స్థాయిలో సైన్యాన్ని మోహరించటం ఇదే మొదటిసారి.

ఇప్పటవరకూ జరిగిన ఘర్షణల్లో 156 మంది పోలీసులు, 11 మంది పౌరులు గాయపడ్డారని.. 300 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.


దేశాధ్యక్షుడు పినేరా టెలివిజన్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తన సహచరుల గళాన్ని.. జీవన వ్యయం విషయంలో వారి అసంతృప్తిని తాను వినమ్రంగా విన్నానని పేర్కొన్నారు.కానీ ప్రతిస్పందన తగిన విధంగా లేదని విమర్శకులు తప్పుపడుతున్నారు.  

అంతకుముందు.. సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను రద్దు చేశారు. దుకాణాలు మూసివేశారు. నగరంలోని భూగర్భ మెట్రో రైలు వ్యవస్థను.. 41 స్టేషన్లలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో సోమవారం వరకూ నిలిపివేశారు. చిలీ అత్యంత ధనిక దేశమే కాదు.. అసమానతలు కూడా అత్యధికంగా ఉన్నాయి. ఆర్థిక సంస్కరణలు చేపట్టాలన్న డిమాండ్లు కొంతకాలంగా తీవ్రమవుతున్నాయి.              

మరింత సమాచారం తెలుసుకోండి: