సరిగ్గా దీపావళి పండుగ సమయానికి ముందు రిలయన్స్ జియో సంస్థ తమ యొక్క సరికొత్త మొబైల్ రీఛార్జ్ ప్లాన్ లను విడుదల చేసింది. నెలకు 222 రూపాయల ప్లాన్ తో మొదలయ్యే ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా ప్రతి ఒక్క కస్టమర్ రోజుకి 2GB ఉచిత డేటాను పొందే అవకాశాన్ని కల్పించింది. అంతేకాకుండా జియో నుంచి జియోకి ఉచితంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు ఇతర మొబైల్ ఆపరేటర్ల సిమ్ లకు 1000 నిమిషాల వాయిస్ కాలింగ్ చేసేందుకు ఇందులో సదుపాయం ఉంది.

కొద్ది రోజుల క్రితం అందరినీ అయోమయానికి గురి చేసిన ఐయూసి టాప్ వోచర్లు కూడా ఈ కొత్త ప్లాన్ లో భాగంగా జియో కస్టమర్ లు కొనాల్సిన అవసరం లేదు. జియో కాకుండా ఇతర సిమ్ లు కలిగిన కస్టమర్లకు 1000 నిమిషాలు అయిపోయిన తరువాత యధావిధిగాగా కాల్ చార్జీల ప్రకారం నిమిషానికి 60 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే ఎప్పటిలాగే రోజుకి 100SMS లు మరియు జియో యాప్ లు అన్నింటికీ అన్నిటికీ ఉచిత సబ్స్క్రిప్షన్ ఇందులో ఉంటుంది.

ముందుగా జియో ప్రకటించినట్లుగా అక్టోబర్ 10 ముందు రీఛార్జి చేయించుకున్న వారందరూ ఎప్పటిలాగే ఇతర సిమ్ లకు కూడా ఉచితంగా కాల్ చేసుకోవచ్చు కానీ ఇప్పటినుండి రీఛార్జి చేసుకోవాల్సిన వారు మాత్రం ఈ ప్లాన్ లలో మాత్రమే రీఛార్జ్ చేయించుకోవాలి. 
222 రూ – 28 రోజుల వ్యాలిడిటీ
333 రూ – 56 రోజుల వ్యాలిడిటీ
444 రూ – 84 రోజుల వ్యాలిడిటీ

ప్రతి ఒక్క ప్లాన్ లో రోజుకి 2GB హై స్పీడ్ డేటా, డైలీ 100SMS లు మరియు 1000 నిమిషాలు ఇతర సిమ్ లకు ఉచిత కాలింగ్ ఉంటుంది. 

గతంతో పోల్చుకుంటే రోజుకి 2GB డేటా ప్లాన్ మూడు నెలలకు 448 రూపాయలు ఉండగా అది కాస్త 444 రూపాయలకు చేశారు. మరియు రెండు నెలల ప్లాన్ ఇప్పుడు 333 రూపాయలు కాగా అంతకు ముందు 396 రూపాయలుగా ఉంది. అయితే కచ్చితంగా 2GB డేటా ప్లాన్ చేయించుకోవాల్సిన ఆంక్ష పెట్టడంకస్టమర్లకు కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: