సినీ రంగ ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సమావేశమయ్యారు.ఈ పర్యటన సమయంలో మోదీ పంచెకట్టులో కనిపించిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమానికి నటులు షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, కంగనా రనౌత్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దర్శకులు ఇంతియాజ్ అలీ, అనురాగ్ బసు, నిర్మాతలు బోనీ కపూర్, ఏక్తా కపూర్ సహా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.


సినీ పరిశ్రమకు ముందెప్పుడూ ఇంత గౌరవం దక్కలేదని, కళాకారులను ఒక ప్రభుత్వం, ప్రధాని అర్థం చేసుకోవడం ఇదే మొదటిసారి కావొచ్చని కంగనా రనౌత్ అన్నారు.ప్రజలను స్పందింపజేసేలా సినిమాలు తీయడం అవసరమని, ప్రధానితో ఇలా సంభాషించడం బాగా అనిపించిందని షారుఖ్ ఖాన్ అన్నారు. మోదీ తమకు స్ఫూర్తినిచ్చారని ఆమిర్ ఖాన్ చెప్పారు.‘‘కళాకారుల శక్తి సామర్థ్యాలను ముందెవరూ ఇలా గుర్తించలేదు. సినీ పరిశ్రమ తరఫున ప్రధానికి కృతజ్ఞతలు’’ అని చెప్పారు.


 అయితే ఈ సమావేశంలో దక్షణాది సినీ ప్రముఖులకు ప్రాతినిధ్యం లేకపోవడంపై అపోలో ఫౌండేషన్ (సీఎస్ఆర్) వైస్ చైర్ పర్సన్, సినీ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఆవేదన ట్విటర్ వేదికగా ఆమె ఈ విషయంపై తన అసంతృప్తిని తెలియజేశారు.12 వేలకు పైగా మంది ఉపాసన ట్వీట్‌ను లైక్ చేశారు. ఆమెకు మద్దతుగా కొంతమంది ట్వీట్లు చేశారు.ఇంతకీ ఏమని ట్వీట్ చేసారో తెలుసా ... 

‘‘డియరెస్ట్ నరేంద్ర మోదీజీ. దక్షిణ భారతీయులమైన మేము కూడా మిమ్మల్ని ఆరాధిస్తాం. మీరు మా ప్రధానిగా ఉన్నందుకు గర్విస్తాం. కానీ సినీ, సాంస్కృతిక రంగాల ప్రముఖులతో మీ సమావేశం కేవలం హిందీ కళాకారుల వరకే పరిమితమైంది. దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన కళాకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు’’ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.


దీనికి ప్రతిస్పందిస్తూ చందు సూర్యతేజ అనే వ్యక్తి మోదీ తీరును తప్పుపట్టారు.బాలీవుడ్ ఒక్కటే సినీ పరిశ్రమ అయితే, ఆయన దృష్టిలో దక్షిణ భారత్‌కున్న అర్థం ఏంటి? మాకు నాలుగు సినీ పరిశ్రమలున్నాయి. ఎంతో మంది కళాకారులున్నారు’’ అని ట్వీట్ చేశారు.


అయితే, ఈ సమయంలోనే తాను రాసిన ఓ కవితకు తమిళ అనువాదాన్ని మోదీ ఆదివారం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇటీవల తమిళనాడులో పర్యటించినప్పుడు దీన్ని రాశానని ఆయన చెప్పారు.‘‘మామళ్లపురంలోని అందమైన తీరంలో ఈ కవిత రాశా’’ అని ట్వీట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: