అసలే వర్షాకాలం... ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల మధ్య ఎలాంటి చిత్రవిచిత్రమైన వ్యాధుల బారిన పడతారు అని అంతా ఒక పక్క భయపడుతుంటే మరొక పక్క తమ నిర్లక్ష్యంతో ఎప్పటికప్పుడు ఈ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు ప్రజలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఏదో ఓపిక, సమయం లేక ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడదామంటే చివరికి వాటి నుంచి కూడా రోగాలు వ్యాపిస్తుంటే ఇక సగటు మనిషి పరిస్థితి ఏమైపోవాలి..? దాదాపు 3400 డెంగీ కేసులు ఈ సంవత్సరం తమిళనాడులో నమోదవగా తాజాగా ఆంధ్రలో ఒక బాల నటుడు కూడా మన రాష్ట్రంలోనే డెంగీ వ్యాధి సోకి మరణించిన విషయం తెలిసిందే.

ఇటువంటి పరిస్థితుల మధ్య చెన్నై కార్పొరేషన్ వారు శుక్రవారం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ వారికి లక్ష రూపాయల జరిమానా విధించారు. ఆ కంపెనీ ఆఫీసులోని పైన ఫ్లోర్ లో ఉంచిన బ్యాగుల్లో ఎప్పటి నుంచో నీళ్ళు నిల్వ ఉండడంతోపాటు అవి కాస్తా దోమలు గుడ్లు పెట్టి పునరుత్పత్తి చెందడానికి సహాయపడుతున్నట్లుగా వారు గుర్తించారు. ఇటువంటి ఎరుపు రంగు డెలివరీ బాక్స్ లోనే మనం ఇంట్లో కూర్చుని ఫోన్లో ఆర్డర్ పెడితే ఆహారం ఇంటికి చేరుస్తారు.

చెన్నై లో అదే ఏరియా లో ఇప్పటికే ఇలాంటివి రెండు మూడు కేసులు నమోదయ్యాయని... దాదాపు 2,200 మంది అధికారులు ఇటువంటి నిర్లక్ష్య కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు నియమించినట్లు తెలిపారు. డెలివరీ ఏజెంట్లు అవి తమ సొంత బ్యాగులు కాకపోవడంతో వాటిని శుభ్రపరచకపోవడం... అధికారులు కూడా డెలివరీ బాయ్స్ వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో పట్టించుకోకపోవడంతో వాటిల్లోనే ఆహారం కవర్లలో ఉంచి కస్టమర్లకు అందించడంతో ఈ వ్యాధి చాలా జోరుగా వ్యాపిస్తోంది. దీనిని అరికట్టేందుకు ఇప్పటికే చెన్నైలో పలుచోట్ల జరిమానా విధించగా గత పది రోజుల్లోనే 20 లక్షల వరకు గ్రేటర్ కార్పొరేషన్ వసూలు చేసింది. 

ప్రతిచోటా పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చెప్పకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా..!


మరింత సమాచారం తెలుసుకోండి: