కృష్ణపట్నం ఇన్‌ఫ్రాసెజ్‌ భూములు సొంత అవసరాలకు వినియోగం చేస్తుండటంతో చాలా వివాదాస్పదంగా మారింది ఇప్పుడు. చెన్నై పోర్టుకు 70 కిలోమీటర్లు, కృష్ణపట్నం పోర్టుకు 100 కిలోమీటర్లు దూరం ఉన్న శ్రీసిటీ సెజ్‌  ఇప్పటికే 180కి పైగా దేశ, విదేశీ యూనిట్లను ఆకర్షించడం ద్వారా 36,000 మందికి ఉపాధి కల్పించారు. చెన్నైకి 100 కిలోమీటర్ల,కృష్ణపట్నం పోర్టుకు 75 కిలోమీటర్లు దూరంలో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నాయుడుపేట సెజ్‌ 60 కంటే భారీ యూనిట్లను ఉండటం వల్ల 6,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. అలానే, ఈ కృష్ణపట్నం పోర్టుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చెప్పటిన మల్టీ ప్రొడక్ట్‌ సెజ్‌ ఎంతమందిని ఆకర్షించి, ఇంకెంత మందికి ఉపాధి కల్పించిందో అసలు ఉహించగలరా? దీనికోసం ప్రభుత్వం నుంచి 4,731.5 ఎకరాల భూమిని తీసుకొని  ఇప్పటికే పదేళ్లు దాటింది.


అయినా  కానీ ఈ సెజ్‌లో ఇప్పటివరుకు  పనులే ప్రారంభం కాలేదు? సెజ్‌ పేరిట తీసుకున్న భూములను కేఐపీఎల్‌ సంస్థ వేరే కంపెనీల పేరిట బ్యాంకుల్లో తనఖా పెట్టి, వేల కోట్ల రుణాలు తీసుకుంది. ఎకరం కేవలం రూ.1.15 లక్షలకే కేటాయింపు.ఇది సాధ్యమేనని నిరూపించింది నవయుగ గ్రూపు.  


ఏపీఐఐసీ ఎన్‌ఓసీ ఇవ్వకుండానే బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చేసాయి. కృష్ణపట్నం పోర్టు సమీపంలో మల్టీ ప్రొడక్ట్‌ సెజ్‌ను ఏర్పాటు చేస్తామంటూ తీసుకున్న భూములను నవయుగ కంపెనీ సొంత అవసరాలకు వినియోగించుకోవడం మరింత వివాదాస్పదంగా మారింది. అవకతవకలన్నీ విచారణలో బట్టబయలు అయ్యాయి. భారీ సెజ్‌ను ఏర్పాటు చేయడానికి నవయుగ గ్రూపు కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మొత్తం 4,731.5 ఎకరాల భూమిని తీసుకుంది. ఈ భూములను సెజ్‌ అభివృద్ధి కోసం వినియోగించకుండా నవయుగ సంస్థ సొంత అవసరాలకు వినియోగించుకుంది. 


యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన చేస్తున్నారు అని ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీని రద్దును అడ్డుకుంటూ వచ్చిన  చంద్రబాబు, నవయుగ సంస్థకు ఎప్పటినుండో అప్పటి సీఎం చంద్రబాబు అండ ఉండటం.చంద్రబాబు అండతోనే ఈ భూములను నవయుగ సంస్థ తనఖా పెట్టి భారీ ఎత్తున రుణాలు తీసుకున్నట్లు అనేక  విమర్శలున్నాయి.సెజ్‌ నిర్మాణం విషయంలో నిబంధనలు మీరటం, ఇంకా పనులు మొదలు పెట్టకపోవడంపై నోటీసులు జారీ చేసినా కేఐపీఎల్‌ స్పందించకపోవడంతో 4,731.5 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఏపీఐఐసీ ఇటీవల నిర్ణయం తీసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: