కల్వకుంట్ల తారకరామారావు ప్రస్తుతం తన తండ్రి కేబినెట్ లో రెండో సారి మంత్రిగా పదవీ బాద్యతలు స్వీకరించగానే, తెలంగాణకు నిధులు సాధించేందుకు రంగంలోకి దిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కొత్తగా ఏర్పాటు కానున్న ఫార్మా సిటీకు రూ.3500 కోట్ల  ఆర్థిక సాయం చేయాలని, మోదీ సర్కారుకు కేటీఆర్  రెండు లేఖలు రాశారు. కేసీఆర్ సర్కారుతో అంతగా సరిగ్గాలేని మోడీ సర్కారు అసలు ఈ విషయంపై ఎలా స్పందిస్తారు,కోరిన సహాయం చేస్తారా? అన్న విషయంపై  చర్చ సాగుతోంది.


కేటీఆర్ సదరు లేఖలను మోదీ కేంద్రంలో వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ మరియు పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న దర్మేంద్ర ప్రదాన్ లకు లేఖలు రాశారు. ఫార్మా సిటీ పూర్తి అయితే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు సిటీలో పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని,రూ.65 వేల కోట్ల పెట్టుబడులు కూడా వస్తాయని లేఖ లో కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఫార్మా సిటీ పూర్తి అయితే లక్షల మందికి ఉపాధి కూడా లభిస్తుందని కేటీఆర్ తెలిపారు.


 ఇదివరకు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు  రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టే విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించి కేటీఆర్ నిధులు రాబట్టడం లో సఫలం అయ్యారు.అలానే ఇప్పుడు తాజాగా మంత్రి పదవి దకట్టంతో  మరోమారు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు మళ్ళీ రంగంలోకి తానే దిగారు.ఈ సందర్భంలో  కేటీఆర్ సాయం కోరుతూ రాసిన లేఖలకు  నరేంద్ర మోదీ సర్కార్ నుంచి స్పందన రాదనే వాదన  ఎక్కువ వినిపిస్తోంది.

అదే సమయంలో నిమ్జ్ హోదా ఇచ్చిన ఫార్మా సిటీకి నిధుల విడుదలలో కేంద్రం స్పందించకుండా ఉండటం కూడా సాధ్యం కాదు అంటున్నారు రాజకీయ విస్లేక్షకులు.చూడాలి మరి కేటీఆర్ సాయం అడుగుతూ రాసిన లేఖలకు మోదీ సర్కారు నుండి ఎలాంటి  స్పందన వస్తుందో చుడాలిక ..


మరింత సమాచారం తెలుసుకోండి: