తెలంగాణా రాష్ట్ర సమ్మెకు దాదాపు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో సమ్మెను ఇంకా పటిష్టం చేయాలని ఆర్టీసీ కార్మికులు సంఘాల జేఏసీ తీర్మానించింది. సమ్మెపై హైకోర్టులో జరిగే చివరి విచారణ వరకు నిరసనలు సాగించాలని ఆదివారం జరిగిన రాజకీయ అఖిలపక్ష నేతల సమావేశంలో నిర్ణయించింది. దీనికి రాజకీయ పార్టీల సంపూర్ణ మద్దతు కూడా తోడైంది. సమ్మెలో భాగంగా ఈ నెల 30న కనీసం 4 లక్షల మందితో సకల జనుల సమర భేరీ పేరుతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇందులో 3 లక్షల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులు, మరో లక్ష మంది సాధారణ ప్రజలు హాజరయ్యేలా రాజకీయ పార్టిలతో కలసి జనసమీకరణ జరపాలని., అప్పటివరకు నిరసన కార్యక్రమాలు కొనసాగించనున్నారు. 

 

కోర్టు తీర్పును కూడా ప్రభుత్వం గౌరవించ లేదని., ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని., దానికి పోలీసుల మద్దతు ఉందని., ప్రజలు మా ఉద్యమానికి మద్దతుగా నిలిచి ఆర్.టీ.సి. విధ్వంసం చేసే కుట్రను అడ్డుకొని ప్రజారవాణా సంస్థను కాపాడుకునేందుకు సహకరించాలి ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు, సుధ కోరారు.. ఇక తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), ఎస్‌.వెంకటేశ్వరరావు (న్యూడెమొక్రసీ) వారు ఆర్.టీ.సీ. కార్మికులు చేపట్టే అన్ని నిరసన కార్యక్రమాల్లో మా నేతలు పాల్గొంటారని., ప్రజాప్రతినిధుల ములాఖత్‌లో మేమూ వస్తామని., వారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.

 

ఎల్‌.రమణ(టీడీపీ) మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులు అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని., ఆర్టీసీ పరిరక్షణకు నడుంబిగించి కోర్టు చెప్పినా ప్రభుత్వం వినకపోవడం విడ్డూరం అంటూ ఎద్దేవాచేశారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని., ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి పౌరసమాజం మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.. ఇక కోదండరాం(టీజేఎస్‌) మాట్లాడుతూ

కోర్టు ఆదేశాన్ని గౌరవించి కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలవాలని., ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందంటూ., ఆర్టీసీ జేఏసీకి మా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: