పదేళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ సమయంలో లగడపాటి రాజగోపాల్ ను హైదరాబాద్ కు రాకుండా విజయవాడలోనే ఆయన్ను అడ్డుకోవాలని చూసిన సమయంలో లగడపాటి ఎవరి కంట పడకుండా.. బైక్ మీద, ఆటోలో ఇతర వాహనాల్లో రాత్రికి రాత్రి హైదరాబాద్ చేరుకొని ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.  సమైక్య ఆంధ్ర కోసం ప్రయత్నం చేశారు.  కానీ, చివరకు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడిపోయింది.  


కాగా, ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి.  రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.  రెండు 2014లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చింది.  అటు తెలంగాణాలో 2014లో, 2018 లోను తెరాస పార్టీ అధికారంలోకి వచ్చింది.  అయితే, 2018 ఎన్నికల తరువాత కెసిఆర్ లో చాలా మార్పులు వచ్చాయి.  కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత మొదలైందా అంటే అవుననేఅంటున్నారు .  


ఇందుకు ఉదాహరణ ఆర్టీసీ సమ్మె.  ఆర్టీసీ సమ్మె చేయడం.. కార్మికుల విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడమతొ పాటుగా వాళ్ళను సెల్ఫ్ డిస్మిస్ అయినట్టుగా చెప్పడంతో కార్మికులు సమ్మెను ఉదృతం చేశారు.  ఇటీవల చేసిన తెలంగాణ బంద్ సైతం విజయవంతం కావడంతో ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు వచ్చాయి.  కాగా, ఇపుడు మరో కొత్త సమస్య తెరాస మెడకు చుట్టుకుంది.  అదేమంటే.. ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.  


ఈ పైపుకుకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావడంతో... తెరాస పార్టీకి ఏం చేయాలో అర్ధంకాలేదు.  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రగతి భవన్ వైపు రాకుండా అడ్డుకున్నారు.  నేతలను ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు.  అటు కాంగ్రెస్ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి బయటకు వస్తే అరెస్ట్ చేయాలని చూశారు.  అయితే, రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచి దొడ్డి గుమ్మం గుండా.. పోలీసుల కంటపడకుండా తప్పించుకొని ద్విచక్రవాహనంపై ప్రగతి భవన్ వరకు వచ్చారు.  అలా ప్రగతి భవన్ వరకు వచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ఒక రకంగా చెప్పాలి అంటే ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: