అమెరికాలో  గన్ కల్చర్ సర్వ సాధారణం. బడి అయినా...బార్ అయినా...తుపాకి మోత మాత్రం సహజం. గన్ పట్టుకుని ఆగ్రహంతో తరగతి గదిలోకి ప్రవేశించిన ఓ విద్యార్థిని వినూత్న రీతిలో ఓ కోచ్ ప్రవర్తించాడు. ఆ విద్యార్థిని కౌగిలించుకొని కాల్పులు అడ్డుకొని..విద్యార్థుల అందరి ప్రాణాలు కాపాడడం జరిగింది. అమెరికాలోని ఒరెగాన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇలా ధైర్యంగా వ్యవహరించింది ఎవరో కాదు ఓ ఫుట్ బాల్ కోచ్. ఈ సంఘటన  మే 17న జరిగిన కూడా అక్టోబర్ 20వ తేదీన వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో బాగా  వైరల్ గా మారింది.


ఇలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన  వివరాలు చూద్దామా మరి.19 ఏళ్ల  గ్రాండాస్ డియాజ్ పార్క్రోజ్ హైస్కూల్ లో చదువుతున్నాడు. మే 17న గన్తో క్లాస్ రూమ్ లోకి ప్రవేశించిన గ్రాండాస్ ను చూడగానే...విద్యార్థులు బాగా గగ్గోలు పెట్టడం చేశారు. దీంతో  విద్యార్థులు అరుపులు విన్న ఫుట్ బాల్ కోచ్ కీనాన్ లోవే పరుగు పరుగున తరగతి గదిలోకి చేరుకొని ఆ విద్యార్థిని అకస్మాత్తుగా కౌగిలించుకొని అందరిని  గందరగోళంలో పడేయడం జరిగింది. 


గ్రాండాస్ తేరుకునే లోపే..తుపాకిని అతని దగ్గర నుంచి లాక్కొని విద్యార్థుల ప్రాణాలును కాపాడాడ . ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో కీనాన్ లోవే ప్రదర్శించిన ధైర్యసాహసాలను పలువురు బాగా మెచ్చుకోవడం కూడా జరిగింది. 

ఐతే  గన్ తో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడనే అభియోగంతో అరెస్ట్ ఐనా  ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్లాస్ రూమ్ లో వెళ్ళింది కేవలం తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకోడానికి వెళ్ళాను కానీ తాను ఇతరుల ప్రాణాలు తీయడానికి పోలేదు అని ఆయన న్యాయమూర్తికి తెలియచేశారు. గ్రాండాస్ వివరాలు తెలుసుకున్న న్యాయమూర్తి మానసిక ఆందోళలన నుంచి బయటపడేందుకు చికిత్స అందించాలని వైద్య సిబ్బందిని సూచించడం జరిగింది. దీంతో పాటుగా - గ్రాండాస్ కు కోర్టు మూడేళ్లు పాటు జైలు శిక్ష  విధించడం జరిగింది


మరింత సమాచారం తెలుసుకోండి: