ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న  ఆర్టీసీ సమ్మె ఇప్పుడప్పుడే ముగిసే ప్రభావాలు కనపడడం లేదు. డిమాండ్ల నెరవేర్చు కోవడం  కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు పరిష్కారమయ్యే దాకా సమ్మె విరమణ లేదని తెగేసి చెబుతుంటే... సమ్మెకు ముగింపు పలకాలని హైకోర్టు చెప్పినా కూడా ... ఎంతదాకా వెళతారో చూద్దాం అని  సీఎం కేసీఆర్ కూడా ప్రవర్తిస్తున్నాడు.


నేటికీ  సమ్మె 17వ రోజుకు చేరగా... ఇటు కేసీఆర్ అటు అశ్వత్థామరెడ్డిలు తమ తమ వాదనలకు కట్టుబడి కోనసాగుతుండటంతో సమ్మె ఇప్పుడప్పుడే ముగింపు పలికేల లేదన్న సమాచారం వినిపిస్తుంది. మరో వైపు సమ్మెకు ఏమైనా  పరిష్కారం చూపకుండా కోనసాగితే... ఉద్యమ సమయంలో కేసీఆర్ చేపట్టిన మిలియన్ మార్చ్ తరహాలో ఆర్టీసీ కార్మికులతో హాఫ్ మిలియన్ మార్చతో పోరును మరింత ఉధృతం చేస్తామంటూ అశ్వత్థామరెడ్డి సంచలన వాఖ్యానాలు చేశారు.


ఇటీవల సమ్మెపై పొలిటికల్ జేఏసీతో ఆర్టీసీ జేఏసీ ప్రత్యేకంగా సమావేశం జరిగింది. ఆర్టీసీ సమ్మె భవిష్యత్తుపై ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంకోసారి గవర్నర్ తమిళసైని కలువాలని ఆర్టీసీ జేఏసీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సమ్మెపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్ కోరాలని జేఏసీ భావనలో ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం కూడా ఆర్టీసీ జేఏసీ మరోసారి సమావేయిసం సమావేశం అయంది. 


ఇక  22న మా పొట్టకొట్టొద్దని తాత్కాలిక డ్రైవర్లు,  కండక్టర్లను కార్మికులు విజ్ఞప్తి చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు. 23న ప్రజాప్రతినిధులను కలిసి సమ్మెకు మద్దతు తెలియచేయాలి అని  సమ్మెలో భాగస్వామ్యం కావాలని కోరుతారు. 24న మహిళా కండక్టర్ల దీక్ష, 25న హైవేలు, రహదారులపై రాస్తారోకోలు చేపట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం. 26న ప్రభుత్వం మనసు మారాలని ఆర్టీసీ కార్మికుల పిల్లలతో దీక్ష చేప్టనున్నారు. 27న పండగ సందర్భంగా జీతాలు రకపోవడంవల్ల నిరసన,  28న సమ్మెపై హైకోర్టు విచారణ ఉన్న సందర్భంగా విరామం. ఇక ఈ నెల 30న 5 లక్షల మందితో సకల జనుల సమర భేరి నిర్వహిస్తామని ఇందుకు సంబంధించిన వేదికను అతి త్వరలో తెలియచేస్తాము అని  ఆర్టీసీ జేఏసీ తెలియచేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: