మన దేశంలో అధికారంలో ఉన్న కులానికో, వర్గానికో చెందిన వారు కూకుండా ముఖ్యమంత్రులైన వారు ఉన్నారా అంటే వాళ్ళు కేవలం ఆరెస్సెస్‌కు చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌లు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రలలో  బీజేపీ ముఖ్యమంత్రులుగా మరో సారి కొనసాగాలంటే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాల అండదండలు తప్పనిసరి.


మరాఠాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో బ్రాహ్మణ వర్గం నుంచి వచ్చిన నిలదొక్కు కోవడమే కాకుండా చాలా తెలివిగా ప్రత్యర్థులను తప్పిస్తూ పూర్తికాలం పాటు అధికారం కొనసాగిన రెండవ ముఖ్యమంత్రి ఫడ్నవీసే. పార్టీలో అన్ని వర్గాలను మెప్పించగలిగిన పాపులర్‌ నాయకుడు కాలేకపోయినప్పటికీ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభావం మేరకు మనగుడ సాగిస్తూ రాగలిగారు.  కానీ చాలా తెలివిగా మాజీ మిత్రపక్షమైన శివసేనతో పొత్తు కుదుర్చుకోవడంలో విజయం సాధించారు. ఒక పక్క పార్టీలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలివిగా పరిష్కరించుకుంటూనే... మరోపక్క ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి ఆకర్షించగలిగారు. 


జాట్‌లు ఎక్కువగా ఉన్న హర్యానాలో పంజాబీ నాయకుడు మనోహర లాల్‌ ఖట్టర్‌ అనూహ్యంగ ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన మాత్రం పదవిలో రాణించేందుకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ పంథానే అనుసరించారు. జాట్ల నాయకత్వంలోని ప్రతిపక్షాన్నే ఎదుర్కొంటూనే మరోపక్క  పాలనపై కొంత దష్టిని కేంద్రీకరించారు.ఆ  రాష్ట్రంలోఎంతో మంది నిరుద్యోగులకు  ఉద్యోగాల కల్పనద్వారా కొంత మంచి పేరు తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఖట్టర్‌ కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రాభవంపైనే ఎక్కువగా ఆధారపడి గెలవాల్సిందే.

ముఖ్యంగా అయన గెలుస్తారనే విశ్వాసం ఇప్పటికే ప్రజల్లో నాటుకుపోయింది. ఇది కాకుండా రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాల కుమ్ములాటలు పార్టీకి కలిసి వచ్చే మరో అవకాశంగా ఉంది.దీనికి తోడు డబ్బు బాగా ఖర్చు చేయగల  పార్టీ అవడం వల్ల ఈ ఎన్నికల్లో ఇరువురు ముఖ్యమంత్రులు తమ ఖర్చులకి ఏ మాత్రం వెనకాడటంలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: