ఆంధ్ర ప్రదేశ్ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మందుబాబులు చాల ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ప్రైవేట్ మందు దుకాణాలను మూసేసిన జగన్ ప్రభుత్వం మద్యం షాపులు తెరవడంతో పాటు మద్యం విక్రయాల సమయాన్ని కూడా తగ్గించడం జరిగింది. జగన్ అయినా ఇంకెవరైనా మందు బాటిల్ బిరడా బిగిస్తే... మందుకు అలవాటు పడ్డ ప్రాణాలు ఎందుకు ఉరుకుంటురు. 


కానీ జగన్ సర్కారు మద్య నియంత్రణ చేసేందుకు అడుగులు వేస్తుంటే... ఏపీ మందు బాబులు మాత్రం కొత్త రూట్ కనిపెట్టడం జరిగింది. ఆంధ్రలో మద్యం అమ్మకాలు తగ్గితే... అదే సమయంలో మందు బాబులు  మద్యపాన ప్రియత్వంతో కేంద్ర పాలిత ప్రాంతం ఐనా యానాంలో మందు కోసం పోవడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని మందు బాబులు ప్రత్యేకించి... యానాంకు కొంత దూరంలోని తూర్పు గోదావరి జిల్లా మందు బాబులు ఇప్పుడు నేరుగా యానాంకు పోవడం మొదలు పెట్టారు . దీనికి ఫలితంగా యానాంలో మద్యం అమ్మకాలు ఒక్క సరిగా భారీగా పెరిగి పోయాయి.


ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో మద్యంతో పాటు అన్ని రకాల వస్తువులు తక్కువ ధరలకే లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అక్కడి  అమ్మె మద్యం కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే మంచి క్వాలిటీ తో లభిస్తుంది.కేంద్ర పాలిత ప్రాంతాల్లో మద్యపానంపై ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు కూడా ఉండవు. రాత్రి నుంచి తెల్లవారే దాకా మందు తాగొచ్చు.

గతంలో  ఆంధ్ర ప్రదేశ్ లో  మద్యపానంపై నియంత్రణ లేని సమయంలో కూడా పెద్ద ఎత్తున  ప్రజలు యానాంకు వెళ్లే  వైనం కూడా మనకు తెలిసిందే.
గతంలో యానాంలో స్టాక్ అయిపోవడానికి 24 రోజులు పడుతుందని అని తెలుపుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం 24 రోజులకు సరిపడే స్టాకు 18 రోజుల్లోనే ఖాళీ అవ్వడం జరుగుతుంది. ఈ మేరకు మరింత  స్టాకును యానాంకు తరలించే పరిస్థితి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: