ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ కార్మిక ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ  కొనసాగుతున్న సమ్మె నేటికీ  17వ రోజుకు చేయరు కోవడం జరిగింది. ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు మద్దతుగా బీజేపీ నాయకురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ  కోరికలు ఏమి కోరడం లేదు అని వాఖ్యానించారు.


ఇక తెలంగాణ  ప్రభుత్వ సర్కార్  ఇలాగే నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తే మాత్రం సకల జనుల సమ్మెగా మారుతున్న ఆర్టీసీ సమ్మెలో కేసీఆర్ కొట్టుకు పోవడం కాయం అని డీకే అరుణ తెలియచేశారు. ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్‌ డిస్మిస్ అనడానికి కేసీఆర్‌కు ఏమాత్రం అర్హత లేదని, సెల్ఫ్‌ డిస్మిస్‌ అనే పదం కేసీఆర్‌కే చందుతుంది అని కానీ కార్మికులకు వర్తించదు అని తెలిపారు . లక్షల కోట్లు అప్పులు తెచ్చుకున్నా.. ఆర్టీసీ అప్పులు మాత్రం చెల్లించలేక పోయారు అని ఆమె అన్నారు.


ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించ లేదో, దానికి గల కారణాలు వివరించవలసినదిగా ఆమె కోరడం జరిగింది. కేసీఆర్‌ అవినీతి బయటపడి జైలుకు పోయే రోజులు అతి సమీపంలో ఉన్నాయి  ఆమె అన్నారు.  ఆర్టీసీని పరిరక్షించాల్సిన ప్రభుత్వం, ఆర్టీసీ ఆస్తులను టీఆర్‌ఎస్‌ నాయకుల చేతుల్లో పెట్టారు అని విమర్శించారు. ఇటీవల హైకోర్టు తీర్పును సీఎం కేసీఆర్ గౌరవించి ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు తీసుకోవాలి అని వాఖ్యానించారు.


గతంలో కూడా కెసిఆర్ పై  డీకే అరుణ సంచలన వ్యాఖ్యానాలు చేయడం కూడా అందరికి తెలిసిందే. ఇక చివారికి ఆర్టీసీ సమ్మె  ఎప్పుడు ముగుస్తుందో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారు తెలంగాణ ప్రజలు. రోజు రోజుకి సమ్మె  మాత్రం తీవ్ర స్థాయిలో జరుగుతుంది.  హైకోర్టు తీర్పును ఆ మాత్రం పట్టిచుకోవడం లేదు కెసిఆర్ సర్కార్.


మరింత సమాచారం తెలుసుకోండి: