స్వ‌యంకృతం.. సాధాన మ‌నుషుల‌కే కాదు.. నాయ‌కుల‌కు కూడా చుక్క‌లు చూపిస్తుంది. ఇప్పుడు ఇదే ప‌రి స్తితిని సీనియ‌ర్ నాయ‌కుడు, ఎంత‌టి స‌మ‌స్య‌పైనైనా త‌న‌దైన శైలిలో స్పందించి ప‌రిష్కారం చూపించే నే త‌గా పేరున్న శ్రీకాకుళానికి చెందిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు శాపంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వైఎస్ హ‌యాంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో రెవిన్యూ మంత్రిగా ఆయ‌న చ‌క్రం తిప్పారు. కాంగ్రెస్ హ‌యాంలో శ్రీకా కుళం జిల్లాను త‌న ఆధిప‌త్యంలోకి తెచ్చుకున్నారు. ఈమూల నుంచి ఆ మూల వ‌ర‌కు కూడా జిల్లాను త‌న క‌నుసైగ‌ల‌తో శాసించారు. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు వైసీపీ పార్టీలో విజ‌యం సాధించారు.


ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌గ‌న్ కేబినెట్‌లో బెర్త్‌ను ఆశించారు. అయితే, అనూహ్యంగా జ‌గ‌న్ మ‌న‌సు ధ‌ర్మాన సోద‌రుడు కృష్ణ‌దాస్‌పైకి మ‌ళ్లింది. ఆయ‌న‌ను ఏరికోరి తెచ్చుకుని జ‌గ‌న్ మంత్రిని చేశారు. దీంతో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు షాక్‌కు గుర‌య్యారు. అయితే, మంత్రి వ‌ర్గ కూర్పు స‌మ‌యంలో జ‌గ‌న్ రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఇప్పుడున్న మంత్రుల‌ను మార్చి కొత్త‌వారికి అవ‌కాశం ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో స‌రే! ఇప్పుడు త‌ప్పి పోయిన ఛాన్స్ అప్పుడైనా ద‌క్కుతుంది లే అని ప్ర‌సాద‌రావు స‌రిపెట్టుకున్నారు. కానీ, ఇప్పుడు వైసీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఆయ‌న‌కు వ‌చ్చే రెండున్న‌రేళ్ల త‌ర్వాత కూడా మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కే ఛాన్స్ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


ఎన్నిక‌ల‌కు ముందు ధ‌ర్మాన వైసీపీలో వ్య‌వ‌హ‌రించిన తీరు. అస‌లు పార్టీలోకి రాక‌ముందు ఆయ‌న వైసీపీ పై చేసిన ఆరోప‌ణ‌లు ఇప్పుడు ఆయ‌నకు శాపంగా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో కాం గ్రెస్‌లో ఉన్న స‌మ‌యంలో జ‌గ‌న్‌ను విమ‌ర్శించారు. అదేస‌మ‌యంలో ఇటీవల ఎన్నిక‌ల స‌మ‌యంలో శ్రీకాకుళం ఎంపీ సీటును వైసీపీ పోగొట్టుకుంది. దీనికి ప్ర‌సాద‌రావే కార‌ణ‌మ‌నే ప్ర‌చారం కూడా ఉంది. ఆయ‌న లోపాయికారీగా టీడీపీకి స‌హ‌క‌రించార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌.. మంత్రి ప‌ద‌వి విష‌యంలో ప్ర‌సాద‌రావును ప‌క్క‌న పెట్టార‌ని చెబుతున్నారు.


అయితే, ఆయ‌న ప్రాధాన్యం మాత్రం త‌గ్గించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.  ప్రసాదరావును ప్రాంతీయ మండలి ఛైర్మన్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఇది నామినేటెడ్ ప‌ద‌వి కావ‌డంతో ఈ విష‌యం తెలిసిన ప్ప‌టి నుంచి ప్ర‌సాద‌రావు మౌనంగా ఉంటున్నారు. పైగా ఇక్క‌డ టీడీపీకి చెందిన మాజీ మంత్రి అచ్చ‌న్నాయుడు దూకుడుగా వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా కూడా ధ‌ర్మాన ఏమీ మాట్లాడ‌డక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాలు ప్ర‌సాద‌రావుకు కీల‌క ప‌ద‌విని దూరం చేశాయ‌ని అంటున్నారు. ఏదేమైనా చేసుకున్న వారికి చేసుకున్నంత !! అని స‌రిపెట్టుకోవ‌డ‌మే ఇప్పుడు ప్ర‌సాద‌రావు ముందున్న ప‌రిస్థితి!!



మరింత సమాచారం తెలుసుకోండి: