కార్యకర్తలు....ఏ పార్టీకైనా మూల స్థంబాలు లాంటి వారు. వారి కష్టంతోనే ఏ పార్టీ అయిన నిలబడుతుంది. వారి కష్టంతోనే అధికారంలోకి రాగలుగుతుంది. వారు సరిగా లేకపోతే ఆ పార్టీ అడ్రెస్ గల్లంతు అవుతుంది. ఇప్పుడు అదే పరిస్తితి ఏపీలో టీడీపీకి ఎదురైంది. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలని అసలు పట్టించుకోలేదు. అందుకే మొన్న ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు పెద్దగా పని చేయలేదు. దాంతో దెబ్బకు టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది. కానీ వైసీపీ కార్యకర్తలు కష్టపడి తమ నాయకుడు జగన్ ని ముఖ్యమంత్రి చేసుకున్నారు.


అయితే అధికారంలో ఉన్నన్ని రోజులు కార్యకర్తలని పట్టించుకొని బాబు...ఇప్పుడు అధికారం కోల్పోగానే కార్యకర్తలు నా ప్రాణం అంటున్నారు. ఈ మధ్య జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న బాబు....కార్యకర్తలని తెగ పొగుడుతున్నారు. పార్టీ కోసం కార్యకర్తల త్యాగాలు మరిచిపోలేనని.. వారి కోసం తన ప్రాణం పణంగా పెడతాని కబుర్లు చెప్పేస్తున్నారు. పైగా అధికారంలో ఉన్నప్పుడు గుడ్డిగా ఉండి... అధికారం కోల్పోయాక కార్యకర్తలకు ఎక్కువ సమయం ఇచ్చే ఉంటే ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేవని ఇప్పుడే కళ్ళు తెరుచుకున్నట్లు మాట్లాడుతున్నారు.


అసలు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. భజన చేసే వాళ్ళకు, పార్టీ మారి వచ్చిన వారిని ఎక్కువ భుజాన వేసుకున్నారు. కొందరు కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు పదవులు ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు ఇచ్చారు. అంతకముందు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పొరాడి పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వారిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల సమయానికి కార్యకర్తలు ఢీలా పడిపోయారు. ఫలితంగా టీడీపీ ఘోర ఓటమి చెందింది. ఒకవేళ చంద్రబాబు అప్పుడు పట్టించుకుంటే టీడీపీకి మెరుగైన ఫలితాలు వచ్చేవి. కానీ అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మాటలు చెబితే....చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది బాబు పరిస్తితి.



మరింత సమాచారం తెలుసుకోండి: