అధికారంలో ఏ పార్టీ ఉన్న ప్రజలకు ఎల్లప్పుడు రక్షణగా ఉండేది పోలీసులే. ప్రభుత్వంలో పోలీసులేదే ముఖ్య పాత్ర. ఒక రాష్ట్రం బాగుండాలంటే అక్కడ శాంతి, భద్రతలు సరిగా ఉండాలి. ఆ శాంతి, భద్రతలు అందించడంలో ఏపీ పోలీసులు పాత్ర సూపర్ అనే చెప్పొచ్చు. అయితే మన రక్షణ కోసం రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడే పోలీసులకు రక్షణ కూడా అంతే అవసరం. వారికి సంక్షేమం అందించడం అంతకంటే ముఖ్యం కూడా.


ఈ రెండు విషయాలని దృష్టిలో పెట్టుకునే ఏపీ సీఎం జగన్ అధికారంలోకి రాగానే పోలీసులు కోసం అద్భుత నిర్ణయాలు తీసుకున్నారు. మొదట అధికారంలోకి వచ్చిన వెంటనే విశ్రాంతి లేకుండా కష్టపడుతున్న పోలీసుల కోసం, దేశంలో ఎక్కడా లేని విధంగా వీక్లీ ఆఫ్ ఇచ్చారు. దీంతో పోలీసుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ వాళ్ళు తమతో సెలవు రోజు ప్రశాంతంగా గడుపతారని సంతోషం వ్యక్తం చేశారు.


ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇక ఇదేగాక తాజాగా పోలీసుల కోసం సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పటి నుంచి జీతాలు తక్కువ అందుకుంటూ, ఎక్కువ కష్టపడుతున్న హోమ్ గార్డుల జీతాలని పెంచారు. జగన్ వారి కష్టాన్ని గుర్తించి రూ.18 వేలు ఉండే వారి జీతాలని రూ. 21,300 చేశారు. అన్నిటికంటే మరో ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. విధి నిర్వహణలో పోలీసులు మరణిస్తే 40 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ సదుపాయాన్ని తీసుకొచ్చారు.


అంటే డ్యూటీ చేస్తూనే ప్రాణాలు విడిచి అమరులై వారికి 40 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే అంగవైకల్యం భారీన పడితే వారికి రూ. 30 లక్షలు ఇన్సూరెన్స్ అందనుంది. ఏదేమైనా ఏపీ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసుల గురించి ఏ సీఎం కూడా ఇలా ఆలోచించ‌లేదు. ఈ నిర్ణ‌యాల‌తో పోలీసుల హీరోగా జ‌గ‌న్ నిలిచిపోయాడు. అదేవిధంగా పదవీ విరమణ చేసిన పోలీసుల సంక్షేమం కోసం కూడా జగన్ కట్టుబడి ఉన్నారు. మొత్తానికి పోలీసులకు సంక్షేమమే...ప్రభుత్వ సంక్షేమం అని జగన్ గట్టిగా నమ్ముతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: