హర్యానా.. మహారాష్ట్ర ఎన్నికలు పూర్తయ్యాయి.  హర్యానాలో 90 స్థానాలకు, మహారాష్ట్రలో 288 స్థానాలకుగాను ఎన్నికలు జరిగాయి.  

హర్యానాలో 60శాతం, మహారాష్ట్రలో 54శాతం వరకు పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి.  

2104 వ సంవత్సరంలో బీజేపీ 122 స్థానాల్లో విజయం సాధించగా, శివసేన 63 స్థానాల్లో విజయం సాధించింది.  

కొన్ని రోజుల హై డ్రామా అనంతరం శివసేన.. బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  


రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ.. పాలనా పరంగా మాత్రం రెండు కలిసి పనిచేశాయి.  ఇదే ఆ రెండు పార్టీలకు కలిసి 

వచ్చింది.  గతంలో కంటే ఈ రెండు పార్టీలు మరింత బలపడినట్టుగా ఎగ్జిట్ పోల్స్ ను బట్టి అర్ధం అవుతున్నది.  ముంబై నగరంలో 

కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలకు ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం ఉందా అంటే అనుమానమే అంటున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.  ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. హర్యానాలోని తిరిగి కమలం వికసిస్తుందని 

వార్తలు వస్తున్నాయి.  ఎగ్జిట్ పోల్స్ ఈ విషయాన్ని  స్పష్టం చేస్తున్నాయి.  దీంతో 90 స్థానాలకు గాను బీజేపీ 60 కి పైగా స్థానాలు 

గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ను బట్టి తెలుస్తోంది.  


మరోసారి కట్టర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోషిస్తారని స్పష్టంగా అర్ధం అవుతుంది.  ఇకపోతే, గతంలో కంటే కాంగ్రెస్, 

జేజేపీ పార్టీలు దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది.  కాంగ్రెస్ పార్టీని గతంలో చేసిన స్కామ్ లు ఇబ్బంది పెడుతున్నాయి.  

ఆ పార్టీ నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.  జైలుకు వెళ్తున్నారు.  వేలకోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కేసుల్లో 

అభియోగాలు ఎదుర్కొంటున్నారు.  నాయకత్వ లోపం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతుంది అన్నది స్పష్టంగా అర్ధం అవుతున్నది. 

కాంగ్రెస్ తిరిగి కోలుకొని పునర్వైభవం పొందాలి అంటే.. ఇప్పటి నుంచే పార్టీలో ప్రక్షాళన జరగాలి.  అలా జరగకుంటే మాత్రం 

కాంగ్రెస్ పార్టీ కోలుకోవడం కష్టం.  


మరింత సమాచారం తెలుసుకోండి: