వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతోంది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కీలక నిర్ణయాలు తీసుకుంది వైసీపీ ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రజలకు పారదర్శక పాలన అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిని  ముందుకు తీసుకెళ్తుంది . ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తుంది వైసీపీ ప్రభుత్వం. కానీ ప్రతిపక్ష టీడీపీ మాత్రం ప్రభుత్వం చేసిన ప్రతి పనిపై  విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  అవినీతి పాలన చేస్తున్నారని ... వైసీపీ నేతలు అందరు అవినీతికి పాల్పడుతున్నారంటూ  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పై  పవిమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 

 ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు  విమర్శలపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు. నేడు మీడియాతో మాట్లాడిన ధర్మాన...  సీఎం జగన్ పై టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అవినీతి పాలన చేస్తు... అవినీతికి పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారని ...చంద్రబాబుకి  దమ్ముంటే అవినీతి ని నిరూపించాలని  అన్నారు మంత్రి ధర్మాన కృష్ణదాస్. ఒకవేళ చంద్రబాబు నిజంగానే జగన్ అవినీతికి పాల్పడ్డారని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. 

 

 

 

 ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలని.. అబద్ధాలు చెప్పడం మానుకోవాలని సూచించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చేసిన తప్పులను  తమ ప్రభుత్వం సరిదిద్దుతుందని ఆయన చెప్పారు. అంతేకాకుండా రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో  టీడీపీ కనుమరుగు కావడం ఖాయమని ఆయన అన్నారు మంత్రి ధర్మాన . అంతే కాకుండా రాష్ట్రంలో సీఎం జగన్  చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేకనే టిడిపి అధినేత చంద్రబాబు అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: