ఆంధ్ర ప్రదేశ్ లోని 13 జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను నియమించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , కొంతమందికి స్దాన చలనం కల్పించడం హాట్ టాఫిక్ గా మారింది . నాలుగు నెలల వ్యవధిలోనే ఇంచార్జ్ మంత్రులకు స్థానచలనం కల్పించడం వెనుక  అనేక  కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది . జిల్లా ఇంచార్జ్ మంత్రులుగా వ్యవహరించిన వారు , పార్టీ నేతలను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారని , అందుకే వారిని ఇంచార్జ్ మంత్రి బాధత్యల నుంచి జగన్ మోహన్ రెడ్డి  తప్పించినట్లు సమాచారం .


 నెల్లూరు జిల్లా ఇంచార్జ్ మంత్రిగా వ్యవహరించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత , స్థానిక పార్టీ ప్రజాప్రతినిధులను , జిల్లా నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు తీసుకువెళ్లడం లో పూర్తిగా  విఫలమయ్యారన్న విమర్శలు విన్పిస్తున్నాయి . జిల్లా లోని ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు , సీనియర్ శాసనసభ్యుల మధ్య విభేదాల  కారణంగా సుచరిత ను కొనసాగిస్తే , ఇబ్బందులు తప్పవని భావించిన జగన్ మోహన్ రెడ్డి , ఇంచార్జ్ బాధ్యతల నుంచి ఆమెను   తప్పించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి .


 ఒకవేళ సుచరిత ను కొనసాగించినా, జిల్లా నేతలు ఆమె మాటను వినిపించుకునే అవకాశాలు లేవని భావించిన జగన్ , ఇంచార్జ్ మంత్రిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ని నియమించారని అంటున్నారు . బాలినేని , జగన్ కు దగ్గరి బంధువు కావడం , జిల్లాలోని సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో , పార్టీ నేతలు , ప్రజాప్రతినిధుల  మధ్య  సమన్వయం సాధించగలరని జగన్ భావించి ఉంటారని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి . ఒక్క సుచరిత నే కాకుండా ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి , తానేటి వనిత లకు కూడా ఇంచార్జ్ మంత్రి పదవి దక్కకపోవడానికి వారి వైఫల్యమే కారణమని తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: