చంద్రబాబునాయుడు ఎందుకో బాగా మారిపోయానిపిస్తోంది. ఆయన నలభయ్యేళ్ళ అనుభవం, హుందాతనం క్రమంగా మసకబారుతున్నాయా అనిపించే విధంగా వైఖరి ఉంటోందని సోషల్ మీడియాలో కామెంట్స్ మీద కామెంట్స్ పడుతున్నాయి. లేకపోతే చంద్రబాబు  ఇలా మాట్లాడడమేంటి అని కూడా అంటున్నారు. బాబు ఇంతకీ ఏమన్నారంటే..


నేనే సీఎం కావాలని ఏపీ మొత్తం అనుకుంటోందని.  ఏపీలో ప్రజలు తప్పు చేశామన్న భావనతో ఉన్నారట. అనవసరంగా జగన్ కి ఓటు చేశామని మధన పడుతున్నారట. అభివ్రుధ్ధికి మారుపేరుగా ఉన్న ఏపీని జగన్ చేతిలో పెట్టామని తీవ్రంగా ఆవేదన చెందుతున్నారట. ఇదంతా శ్రీకాకుళం టూర్ల బాబు నోటి వెంట వచ్చిన ఆణి ముత్యాలు, విలేకరుల సమావేశంలో చంద్రబాబు ప్రజలు మళ్ళీ నన్నే సీఎం గా ఎన్నుకోవాలనుకుంటున్నారని చెప్పడమే పెద్ద కామెడీ అని సెటైర్లు పడుతున్నాయి. 


ఎందుకంటే ఏపీలో జగన్ సర్కార్ వచ్చి  గట్టిగా అయిందు నెలలు  కూడా కాలేదు. ఇంకా నాలుగున్నర నెలలకు పైగా ఎన్నికలకు సమయం ఉంది. కానీ చంద్రబాబు తీరు చూస్తే రేపో మాపో ఎన్నికలు వచ్చేస్తున్నాయని, నన్ను జనం సీఎం గా చూడాలనుకుంటున్నారని చెబుతున్నారు. మరి ఇప్పటికే ఇలా ఉంటే మిగిలిన కాలమంతా బాబు ఏ రకంగా తనకు తాను సర్దిచెప్పుకుని సంత్రుప్తి పడతారో కదా అని అంటున్నారు. 


జగన్ అన్ని విధాలుగా ఏపీని పాడుచేశారని ఆక్రోశం వెళ్ళగక్కుతున్న బాబు  ఈ క్షణంలో ఎన్నికలు పెడితే  ప్రజలు తననే గెలిపిస్తారని అంటున్నారు. బాగానే ఉంది కానీ ఎవరికి వారికి  బుద్ది పుట్టినపుడల్లా ఎన్నికలు పెట్టేందుకు కుదరదు కదా. మనకు ఓ విధానం, రాజ్యాంగం కూడా ఉన్నాయి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబు ఈ సంగతి మరచిపోవడమే అసలైన కామెడీ అంటున్నారు.  ముందు ముందు మరెన్ని రకాలుగా బాబు మాట్లాడుతారో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: