పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ వచ్చిన కొత్తలో అనేకానేక ఊహాగానాలకు తెర తీసింది. టాలీవుడ్ లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తనదైన మార్క్ ను చూపిస్తాడు అనుకుంటే చివరికి తన అన్న చిరంజీవి కన్నా ఘోరంగా విఫలమయి బొక్క బోర్లా పడ్డాడు. తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోవడమే కాకుండా మొత్తం 175 స్థానాల్లో కేవలం ఒకే ఒక్క సీటు అతని పార్టీ సాధించడం గమనార్హం. అయితే ఇప్పుడు ఆ ఒక్కగానొక్క ఎమ్మెల్యేను కూడా జనసేన పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది అన్న మాటలు వినిపిస్తున్నాయి.

విషయం ఏమిటంటే జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీకి వచ్చిన కొత్తల్లో జగన్ ను తెగ పొగిడేసేవాడు. జగన్ తీసుకువస్తున్న విధివిధానాలు మరియు అమలు చేస్తున్న హామీలపై అతను చాలా సానుకూలంగా స్పందించారు కూడా. ఆతర్వాత రాపాక ఒక చిన్న కేసులో ఇరుక్కోవడం జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అంతా పట్టుబట్టి మరీ అతనిని ఆ కేసు నుంచి విడిపించడం చకచకా జరిగిపోయాయి. ఏమైందో ఏమో కానీ తర్వాత నుంచి రాపాక కూడా జగన్ పై పై విమర్శలు గుప్పించడం మొదలెట్టాడు. ఈ కథ ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్.

మొన్న ఈ మధ్య అ వరప్రసాద్ ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ వారితో కలిసి జగన్ ఆటోడ్రైవర్ల విషయంలో తీసుకున్న కొత్త నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ అతని ఫోటో పై పాలాభిషేకం చేశాడు. దీనిని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేసేసి జనసేనపై విపరీతమైన ట్రోలింగ్ కూడా చేశారు. పవన్ కళ్యాణ్ దీనిని సీరియస్ గా తీసుకున్నాడు అన్న వాదనలు కూడా ఇప్పుడు బయట వినిపిస్తున్నాయి. ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే కూడా ఇలా చేయడం ఏంటి అని జనసేన పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోందట. దీనిపై పవన్ కనుక రాపాక ను గట్టి సంజాయిషీ అడిగితే అది ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది... చివరికి రాపాక పార్టీని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా అన్న విషయానికి కాలమే జవాబు చెప్పాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: