ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందని మరోసారి బట్టబయలైంది. సీఎం జగన్ అమిత్ షాను కలవడానికి ముందుగానే అపాయింట్ మెంట్ తీసుకున్నాడు. కానీ అమిత్ షా మాత్రం సీఎం జగన్ రాత్రి 11 గంటల వరకు ఎదురు చూసినా కలవడానికి ఆసక్తి చూపలేదు. 
 
ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అపాయింట్ మెంట్ ప్రకారం నిన్న సాయంత్రం సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అవుతారని, ఈ సమావేశంలో రాష్ట్ర విభజన సమస్యల గురించి చర్చిస్తారని తెలిపాయి. నిన్న ఉదయం ఢిల్లీకి చేరుకున్న జగన్ హోం మంత్రి కార్యాలయం నుండి పిలుపు వస్తుందని భావించినా హోం మంత్రి కార్యాలయం నుండి పిలుపు రాలేదు. వైసీపీ నేతలు అపాయింట్ మెంట్ ఇచ్చిఅమిత్ షా ఇలా వ్యవహరించటం ఏమిటని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
సీఎం జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చినా కలవని అమిత్ షా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను మాత్రం కలిశారు. అమిత్ షా మరికొందరు ఎంపీలను కూడా కలిసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ కు అమిత్ షా ఈరోజు ఉదయం కలుస్తానని చెప్పినట్లు సమాచారం అందుతోంది. సీఎం జగన్ విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లను కలవడానికి ప్రయత్నించినా సీఎం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. 
 
సీఎం జగన్ విద్యుత్ శాఖ మంత్రితో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గురించి చర్చించాలని అనుకున్నాడని, కేంద్ర జలశక్తి మంత్రితో పోలవరం రివర్స్ టెండరింగ్ అంశాన్ని గురించి చర్చించాలని అనుకున్నాడని తెలుస్తోంది. కానీ హోం మంత్రి నుండి పిలుపు రాకపోవటంతో మిగతా మంత్రులు కూడా సీఎం జగన్ ను కలవడానికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: