ఎన్నికలు పూర్తయ్యాయి.. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కూడా ప్రకటించాయి.  మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాల్లో బీజీపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.  ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాన్ని బట్టి రెండు రాష్ట్రాల్లో ఈ పార్టీకి తిరుగులేదు.  ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే.. దాని వలన మొదట భయపడేది పాకిస్తాన్ దేశం.  ఎందుకంటే దేశంలో బీజేపీ క్రమంగా బలపడుతుండటంతో.. జాతీయవాదం పెరిగిపోతుంది.  జాతీయ భద్రతా విషయంలో బీజేపీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.  


ఇండియాలో పవర్ లో బీజేపీ ఉంటె.. బోర్డర్ లో ఉండే ఆర్మీకి బోలెడు బలం వచ్చినట్టే.  బోర్డర్ లో ఇండియా ఎంతటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నా.. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ముందుకు సాగుతోంది.  ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్నారు సైనికులు.  సైనికులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది కేంద్రం.  ఇదే దానికి బలం. గతంలో మాదిరిగా కాకుండా.. సైనికుల కోసం అధునాతనమైన దుస్తులు, షూస్, గన్స్, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తున్నది.


పీవోకే ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.. కేంద్రం నుంచి ఆదేశాలు ఇవ్వడమే తరువాయి అని ఆర్మీ ఇప్పటికే స్పష్టం చేసింది.  దేశంలో బీజేపీ ప్రభుత్వం బలహీనంగా ఉంటె.. సైన్యానికి ఇలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కాస్త భయపడుతుంది.  ఎందుకంటే మెజారిటీ లేదు.  పొత్తులు ఉంటాయి.  భాగస్వామ్య పార్టీల నుంచి ఒత్తిడి వస్తుంది.  ఫలితంగా చేయాల్సిన పనిని సక్రమంగా చేయలేరు. గతంలో జరిగింది అదే.  ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఫుల్ మెజారిటీ ఉన్నది.  కానీ, ఏమి చేయలేకపోయింది. 


కాగా, ఇప్పుడు దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నది.  అంతేకాదు, బీజేపీకి మెజారిటీ కూడా ఉండటంతో పాక్ విషయంలో గట్టినిర్ణయాలు తీసుకుంటోంది.  అలానే పరిష్కరించకుండా దూరంగా పెట్టిన ఆర్టికల్ 370 రద్దు చేసింది.  దీంతో కాంగ్రెస్ పార్టీ భగ్గుమన్నది.  కాశ్మీర్ వాసుల గొంతు నొక్కేశారని గగ్గోలు పెట్టింది.  కానీ, బీజేపీ మాత్రం వాటి గురించి పట్టించుకోలేదు.  అనుకున్నట్టుగానే కాశ్మీర్లో ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొన్నది.  బోర్డర్ లో పాక్ నుంచి ఎలాంటి ఒత్తిడులు తలెత్తినా వాటిని ఎదుర్కోవడానికి సదా సిద్ధంగా ఉంది ప్రభుత్వం.  


మరింత సమాచారం తెలుసుకోండి: