చైనా అన్ని రంగాల్లో ఇండియా కంటే పైచేయి సాధించాలని చూస్తోంది.  అయితే, అంతరిక్ష రంగంలో మాత్రం చైనా భారత్ కంటే వెనుకబడి ఉన్నది.  ముఖ్యంగా అంతరిక్ష మార్కెట్ రంగంలో ఇండియా దూసుకుపోతున్నది.  తక్కువ ధరకే ప్రపంచంలోని ఉపగ్రహాలను రోదసీలోకి పంపి క్యాష్ చేసుకుంటోంది.  ఇది చిన్న చిన్న దేశాలకు వరంగా మారింది.  రోదసీలోకి పంపిన ఉపగ్రహాల వలన డబ్బుతో ఇస్రో ప్రయోగాలు చేస్తున్నది. మరో పదేళ్లలో అంతరిక్ష మార్కెట్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉన్నది.  


దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తోంది ఇండియా.  అంతరిక్షమార్కెట్ లో కనీసం పదోశాతం వాటాను ఇండియా దక్కించుకున్నా.. ఈ మార్గం ద్వారా ఇండియాకు కోట్లాది రూపాయల డబ్బు వస్తుంది.  దీంతో అనుకున్న ప్రయోగాలు చేయడానికి ఈజీ అవుతుంది.  ఇండియా గతంలో 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడంతో.. ప్రపంచదేశాలు షాక్ అయ్యాయి.  ఈస్థాయిలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టగలిగే వాహననౌకలు ఇండియా వద్ద ఉన్నాయని ప్రపంచానికి తెలియజేసింది.  


దీంతో ప్రపంచం ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నది.  అయితే, ఇప్పుడు ఇండియా షార్ట్ రేంజ్ వాహన నౌకలను తయారుచేస్తోంది.  వీటి అవసరం చాలా ఉన్నది.  భవిష్యత్తులో భూకక్ష్యలోకి వేలాది ఉపగ్రహాలు ప్రవేశించబోతున్నాయి.  వాటిల్లో ఎక్కువశాతం ఇండియా నుంచే ప్రయోగించబోతున్నారు.  వాటిని ప్రయోగించాలంటే షార్ట్ రేంజ్ వాహన నౌకలు అవసరం.  అప్పుడే సరైన స్థానంలో వాటిని ప్రవేశపెట్టగలుగుతారు.  


అయితే, ఇప్పుడు చైనా కూడా ఈ వ్యాపారంలోకి ప్రవేశించడానికి పధకాలు వేస్తోంది. ఘన, ద్రవ ఇంధనంతో ప్రయోగించే రాకెట్లను తయారు చేయడానికి రెడీ అవుతున్నది.  అలానే అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.  ఇప్పటికే ఇండియా అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే.  ఈ దిశగా చైనా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది.  కారణం ఏంటి అంటే.. ఇండియాతో పోటీ పడటమే.  అయితే, ఈ రంగంలో ఇండియాను మించడం అసాధ్యం అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: