రాష్ట్ర స్థాయి పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన పరేడ్‌లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన వారినుద్దేశించి మాట్లాడారు. ఎవరికైనా ఒకే రూలు, ఒకే చట్టం అయినప్పుడే న్యాయం, ధర్మం బతుకుతాయని ప్రతి పోలీస్‌ సోదరుడికి, పోలీస్‌ అక్కచెల్లెమ్మలకు గుర్తు చేస్తున్నానని అన్నారు.


మన రాష్ట్ర భద్రత కోసం అనేక సందర్భాల్లో ఎందరో ప్రాణాలు అర్పించారు. అలాంటి అమర వీరులకు ఇక్కడి నుంచి సగర్వంగా సెల్యూట్‌ చేస్తున్నాను. పోలీస్‌ టోపీ మీద ఉన్న సింహాలు మన దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం. దానిని కాపాడే వారే పోలీసులు. అందుకే పోలీస్‌ స్టేషన్‌ను మనం రక్షకభట నిలయం అని పిలుస్తున్నాం.


మెరుగైన పోలీసు సేవలు అందించాలన్నా, ప్రజల హృదయాల్లో నిలవాలన్నా శాంతిభధ్రతల విషయంలో పోలీసులు రాజీ పడకూడదు. లా అండ్‌ ఆర్డర్‌ విషయంలో ఎంతటి వారికైనా మినహాయింపు ఉండకూడదని నా మొట్టమొదటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చెప్పాను. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులకు రక్షణ కల్పించడంలో ఏమరుపాటు వద్దని చెప్పాను.  పోలీసులు వారానికి ఒక రోజు వారి రోజువారీ బాధ్యతలను పక్కన పెట్టి కుటుంబంతో గడిపితే.. మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. అందుకే వారంతపు సెలవు ప్రకటిస్తూ మార్పునకు శ్రీకారం చుట్టాం. తద్వారా మెరుగైన పోలీస్‌ వ్యవస్థ వస్తుందనే విశ్వాసం నాకుంది.  


పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాళి అర్పించడంలో చూపిన నిబద్ధత అందరి ప్రశంసలందుకుంది. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, సీనియర్‌ ఐపీఎస్‌లు వెంట రాగా సీఎం వైఎస్‌ జగన్‌.. చెప్పులు పక్కన వదిలి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు.


దేశంలో మొదటిసారిగా ఏపీలోనే ఇన్సూరెన్స్‌ కవరేజీని పోలీస్‌ సిబ్బంది పదవీ విరమణ తర్వాత కూడా వర్తించేలా నిబంధనలు తీసుకొచ్చిన హోం మంత్రి, డీజీపీలకు నా అభినందనలు. హోంగార్డ్, కానిస్టేబుల్, ప్రతి అధికారికి ఒక్కటే చెబుతున్నా.. విధి నిర్వహణలో మీరు మంచి పేరు తెచ్చుకునే దిశగా అడుగులు వేయండి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకు తోడుగా వుంటుంది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: