జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం వస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలవటానికి జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మధ్యాహ్నం నుండి అర్ధరాత్రి వరకూ ఎదురు  చూసినా జగన్ కు పిలుపు రాలేదు.  సోమవారం అపాయింట్మెంట్ ఇచ్చి కూడా ముఖ్యమంత్రిని  కలవటానికి అమిత్ షా ఎందుకు మొహం చాటేశారో అర్ధం కావటం లేదు.

 

అమిత్ షా ను కలవటానికి జగన్ ప్రయత్నించటం ఇది మూడోసారి. మూడుసార్లు భేటికి సమయం ఇచ్చి తర్వాత రద్దు చేయటం విచిత్రంగా ఉంది. సిఎం స్ధాయిలో ఉండే వ్యక్తి ముందుగా ఎటువంటి అపాయిట్మెంట్ తీసుకోకుండానే ఢిల్లీకి చేరుకోరన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ముందుగా అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు రద్దవుతోంది ? లేకపోతే ఎందుకు కవలటానికి ఇష్టపడటం లేదు ? అన్న విషయాన్ని అమిత్  షా కార్యాలయమే చెప్పాలి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ ను కలవటానికి మొహం చాటేసిన అమిత్ ష్ సోమవారం నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ తో మాత్రం భేటి అయ్యారు. అంటే సొంతపార్టీ ఎంపిని కలవటానికి సమయం కేటాయించిన హోమంత్రి జగన్ ను కలవటానికి మాత్రం ఇష్టపడలేదు. అంటే కావాలనే జగన్ ను దూరంగా ఉంచినట్లు స్పష్టమైపోతోంది. నిజంగా ఇది జగన్ ను అవమానించటమే.

 

జగన్ ను అవమానించటమంటే యావత్తు ఏపి ప్రజలను అవమానించటమే అన్న విషయాన్ని బిజెపి మరచిపోతోంది. జగన్ ను కలవటానికి షా కు ఇష్టం లేకపోతే అదే విషయాన్ని చెప్పేస్తే సరిపోతుంది. గతంలో చంద్రబాబునాయుడు కూడా నరేంద్రమోడిని కలవటానికి ప్రయత్నించి చాలాసార్లు ఫెయిలయ్యారు.

 

అప్పట్లో అంటే మోడి అపాయింట్మెంట్ లేకుండానే నేరుగా చంద్రబాబు కలుద్దామని అనుకున్నారు కాబట్టి సాధ్యం కాలేదని అనుకోవచ్చు. కానీ ఇపుడు అలా కాదు కదా ? అపాయింట్మెంట్ ఇచ్చి కూడా క్యాన్సిల్ చేయటమో లేకపోతే వెయిట్ చేయించటమే చేస్తున్నారంటే ఉద్దేశ్యపూర్వకంగా అవమానించటం తప్ప మరోటి కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: